డిఫెన్స్‌ డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

డిఫెన్స్‌ డ్రైవింగ్‌తో ప్రమాదాల నివారణ : ఎస్పీ

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

సూర్యాపేటటౌన్‌ : డిఫెన్స్‌ డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మన తప్పు కాకపోయినా ఇతరుల తప్పులను ముందుగానే అంచనా వేసి జాగ్రత్తగా వాహనం నడపడం మంచిదని పేర్కొన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుంచి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ‘అరైవ్‌ అలైవ్‌’ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఫెన్స్‌ డ్రైవింగ్‌పై విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

మట్టపల్లి లక్ష్మీనరసింహుడి

నిత్య కల్యాణం

మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను అధిష్టింపజేసి ఆలయ తిరు మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌ కుమార్‌, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్మికుల పనివేళలు మార్చాలి

సూర్యాపేట అర్బన్‌ : ప్రస్తుతం ఎండలు ముదిరిన కారణంగా మున్సిపల్‌ కార్మికులను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే పని చేయించాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంపటి గురూజీ అన్నారు. శనివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్‌ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించడం తగదన్నారు. కార్మికులకు నెలకు రూ. 26వేల వేతనం ఇవ్వాలని, ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు అందించాలని కోరారు. 80 మంది మున్సిపల్‌ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి కాంట్రాక్టర్‌ ద్వారా రూ.12 వేల వేతనం మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు నాగమ్మ, యాదమ్మ, గట్టు నరేష్‌, వెంకటాద్రి, శ్వేత, సతీష్‌, భిక్షం, నాగయ్య, బక్కమ్మ పాల్గొన్నారు.

21న జిల్లా సదస్సు

సూర్యాపేట అర్బన్‌ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ నెల 21న సూర్యాపేటలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం. డేవిడ్‌కుమార్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో చంద్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా ఐఎఫ్‌టీయూ జాతీయ కార్యదర్శి పి.ప్రసాద్‌ హాజరు కానున్నట్లు చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుట్ల సైదులు, ఏఐకేఎంఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్‌, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు పెద్దింటి రంగారెడ్డి, దేసోజు మధు, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు సింహాద్రి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement