డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మించాలి

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

సూర్యాపేటటౌన్‌ : మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రజలు తమ వంతు కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెండెం వెంకటరమణ కోరారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శని వారం ఔషధ నియంత్రణశాఖ, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నియంత్రణ, నిబంధనల బలోపేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీని డీఎంహెచ్‌ఓ ప్రారంభించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్‌ వంటి వాటికి యువత బానిసలై తమ ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్‌, పట్టణ సీఐ వెంకటయ్య, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌, ఈగల్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, హెచ్‌ఓడీలు, డాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement