కోదాడరూరల్ : మండలంలో పలు ప్రభుత్వ భవన నిర్మాణాలు ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. ఏళ్ల తరబడి భవనాల పనులు ఆగుతూ.. సాగుతూ నత్తనడకన సాగుతున్నాయి. కోదాడ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌తో పాటు గణవపరం, తొగర్రాయి, దోరకుంట, నల్లబండగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులు ముందుకు సాగడం లేదు.
ఎనిమిదేళ్లైనా అసంపూర్తిగా..
కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ కేఎల్‌ఆర్ కాలనీ వద్ద ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణానికి రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.42 లక్షల నిధులు మంజూరు చేసింది. 2018లో నాటి అధికారులు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ పనులు చేపట్టిన మూడు నెలలకే బేస్‌మెంట్ వరకు చేపట్టిన పనులకు నిధులు విడుదల కావడం లేదని నిలిపివేశాడు. ఆరేళ్ల తర్వాత 2024 లో నిధులు విడుదల కావడంతో స్లాబ్ వేశాడు. ఆ తర్వాత మళ్లీ నిధులు విడుదల రాలేదని పనులు ఆపాడు. ఎనిమిదేళ్లైనా భవన నిర్మాణం పూర్తికాలేదు. దీంతో అద్దె భవనంలో స్టేషన్ స్టేషన్‌ను కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎకై ్సజ్ సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం స్టేషన్‌కు వస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మెటీరియల్ ఖర్చులు పెరిగాయని..
మండలంలోని గణపవరం, తొగర్రాయి, దోరకుంట, నల్లబండగూడెంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నూతన భవనాల నిర్మాణాలకు 2022లో ఒక్కో భవనానికి జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద రూ. 15 లక్షలు మంజూరయ్యాయి. అదే సంవత్సరంలో అధికారులు, నాటి పాలకులు శంకుస్థాపన చేశారు. ఆయా చోట్ల పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు వెంటన పనులు ప్రారంభించారు. కానీ నిధులు విడుదల కావడం లేదని బెస్‌మెంట్ లెవల్‌లోనే పనులు నిలిపివేశాడు. ఆ తర్వాత చేసిన పనులకు నిధులు విడుదలైన తర్వాత పనులు ప్రారంభించి స్లాబ్ వేసి గోడలు కట్టి ప్లాస్టింగ్ పనులను సగం వరకు చేపట్టి వదిలేశారు. పనులకు సంబంధించి మెటీరియల్ ఖర్చులు పెరిగాయని మరికొంత నిధులు అదనంగా మంజూరు చేయిస్తేనే పనులు పూర్తవుతాయని కాంట్రాక్టర్లు చెప్పడంతో ఆ నాలుగు భవనాలు గత నాలుగేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో గణపవరంలో పంచాయతీ భవనంలోని ఓ గదిలో, తొగర్రాయిలో ఓ అద్దె భవనంలో, దోరకుంటలో పురాతన భవనంలో, నల్లబండగూడెంలో ఓ ప్రభుత్వ భవనంలో ఓ గదిని తీసుకొని వైద్యసిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు కలుగజేసుకొని నిలిచిపోయిన ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆయా గ్రామాల ప్రజులు, సిబ్బంది కోరుతున్నారు.
ఫ ఎనిమిదేళ్లైనా పూర్తికాని
ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ నిర్మాణం
ఫ అసంపూర్తిగానే ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాలు


