సాక్షి ప్రతినిది, నల్లగొండ : శాసన సభ, శాసన మండలిలో పలువురి సభ్యులకు విప్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా తుంగతుర్తికి చెందిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు, అసెంబ్లీలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు విప్ హోదా దక్కింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. తాజాగా మరో ఇద్దరికి విప్ హోదా వచ్చింది.
వేముల వీరేశం, అద్దంకి
దయాకర్‌కు ప్రభుత్వ విప్
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
ఇప్పటికే ఆలేరు ఎమ్మెల్యే
ఐలయ్యకు విప్ హోదా


