గోదావరి జలాల నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

గోదావరి జలాల నిలిపివేత

Mar 20 2026 10:17 AM | Updated on Mar 20 2026 10:17 AM

మళ్లీ 27 నుంచి

వదలనున్న అధికారులు

అర్వపల్లి : యాసంగి సీజన్‌కుగాను వారబందీ విధానంలో 5వ తడిగా విడుదల చేసిన గోదావరి జలాలను గురువారం నిలిపివేశారు. ఈసారి వారబందీ విధానంలో మూడురోజులపాటు అదనంగా వదిలారు. తిరిగి వారబందీ విధానంలో 6వతడి చివరి విడతగా ఈ నెల 27 నుంచి వదలనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్‌, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్‌ తెలిపారు.

మట్టపల్లిలో

గరుడ వాహన సేవ

మఠంపల్లి : మట్టపల్లి దేవాలయంలో గురువారం గరుడవాహన సేవను ఊరేగించారు. అంతకుముందు శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి శ్రీ రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామికి శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌ కుమార్‌, ఈఓ జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో

సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెలుగు నూతన సంవత్సరం ఉగాది కావడంతో గురువారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలం కారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో శ్రీస్వామి అమ్మవార్ల సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

సమాజ సేవతోనే గుర్తింపు

చిట్యాల : సమాజ సేవతోనే గుర్తింపు లభిస్తుందని రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కుకుడాల లక్ష్మణ్‌ అన్నారు. ప్రమోద సాహితీ సంస్థ ఆధ్వర్యంలో చిట్యాలలో గురువారం రాత్రి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన దాసరి శ్రీరాములు(విద్యారంగం), డాక్టర్‌ మూడ సుదర్శన్‌ (వైద్యరంగం), యేళ్ల భయ్యన్న(జర్నలిజం), కొంతం సత్తిరెడ్డి(వ్యవసాయం)లకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రమోద సాహితీ సంస్థ అధ్యక్షుడు కందిమళ్ల కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పందిరి గీతారమేష్‌, వైస్‌ చైర్మన్‌ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు, ఏఎంసీ చైర్మన్‌ వినోదమోహన్‌రెడ్డి, శ్రీకనకదుర్గా ఆలయ చైర్మన్‌ ఆంజనేయులు, సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement