చివ్వెంల(సూర్యాపేట) : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికుల పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం భారత వికలాంగ హక్కుల పరిరక్షణ సమితి (బీవీహెఓచ్‌పీఎస్) ఆధ్వర్యంలో చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామంలో పచ్చిగడ్డి తింటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతన పెన్షన్లు పంపిణీ చేయాలని, లేనియెడల ఈ నూతన సంవత్సరం నుంచే రేవంత్ రెడ్డి సర్కార్‌కు ‘పరాభవం’ తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి ఈదయ్యబాబు, మున్న మధుసూదన్, పిట్ట వెంకట్‌రెడ్డి, మున్న మల్లయ్య, ఖాదర్, రత్తమ్మ, ఇమాంబీ, వెంకటమ్మ, సత్యం, పాషా, నారయణ, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.


