నేరేడుచర్లను గ్రీన్ సిటీగా మారుస్తా
నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీని గ్రీన్ సిటీగా మార్చడంతో పాటు రూ.వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నేరేడుచర్లలోని పలు వార్డుల్లో ఆయన రోడ్డు షో నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ మాదిరిగా అన్నీ మున్సిపాలిటీలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొణతం చిన వెంకట్‌రెడ్డి, నూకల సందీప్‌రెడ్డి, బచ్చలకూరి ప్రకాశ్, యారవ లక్ష్మి, ఇంజమూరి శ్రీకాంత్, వాణి, శంకర్, కొణతం మంజుల, వల్లంశెట్ల జ్యోతి, తాళ్ల లావణ్య, లక్ష్మయ్య, మొగలాబి, శ్రీను, కోటేశ్వరమ్మ, అబ్దుల్ ఖలీం తదితరులున్నారు.
ఈ ప్రాంత అభివృద్ధి నా ప్రాణం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తాటిపాముల తన సొంత గ్రామమని, తిరుమలగిరి, ఈ ప్రాంత అభివృద్ధి తన ప్రాణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తిరుమలగిరి మున్సిపాలిటీలోని స్థానిక క్రాస్ రోడ్‌లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి ఎన్ని కోట్ల రూపాయలు అయినా మంజూరు చేయిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో 1000 ఇళ్లు ఇస్తామని తెలిపారు. మండలంలోని 8 గ్రామాలకు దేవాదుల ఫేజ్–6 ద్వారా 18 వేల ఎకరాలకు నీరు అందిస్తామని, ఈ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. కార్నర్ సమావేశం సందర్భంగా పాత గ్రామం నుంచి క్రాస్ రోడ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ, ఎన్నికల అబ్జర్వర్ రవళిరెడ్డి, వదలపాటి అధ్యక్షులు నరేష్, సంకెపల్లి కొండల్ రెడ్డి, మూల అశోక్ రెడ్డి, జమ్మిలాలు, అభ్యర్థులు పాల్గొన్నారు.
భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మురుగు కాలువలో వేసినట్లే..
హుజూర్‌నగర్ : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మురుగు కాలువలో వేసినట్లేనని, ఎవరికీ ఉపయోగపడదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్ మున్సిపాలిటీలోని 5, 6 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలోని జైలు నుంచి వచ్చే మురుగు నీటికి శాశ్వత పరిష్కారం చూపుతానని తెలిపారు. అసంపూర్తి ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని పూర్తి చేయిస్తానన్నారు. కమ్యూనిటీ హాల్, సాయిబాబా థియేటర్ వద్ద చిల్ట్రెన్స్ పార్కు, మహిళల వాకింక్ ట్రాక్, జిమ్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, సీపీఎం నాయకులు శీలం శ్రీను, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు పాల్గొన్నారు.
నేరేడుచర్లను గ్రీన్ సిటీగా మారుస్తా


