ఆదర్శంగా తీర్చిదిద్దుతా
● డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా
● విలీనమైన గ్రామాల అభివృద్ధికి
అధిక నిధులు తీసుకువస్తా
● సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్
కాంగ్రెస్ అభ్యర్థి మొరిశెట్టి నివేదిత
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, సూర్యాపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని 46వ వార్డు అభ్యర్థి, సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి మొరిశెట్టి నివేదిత అన్నారు. సోమవారం ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే..
మౌలిక వసతుల కల్పనే ధ్యేయం
పట్టణంలో మా వార్డుతో పాటు అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేస్తా. ముఖ్యంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థను, అంతర్గత రోడ్లను మెరుగుపరుస్తా. పట్టణంలో మౌలిక వసతులు కల్పిస్తా. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పిస్తా. వార్డుల్లో మా దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తా. పట్టణానికి స్వచ్ఛమైన తాగునీరును అందిస్తా. దోమలు, పందుల నివారణకు కృషి చేస్తా. సూర్యాపేట మున్సిపాలిటీలోని శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలను అభివృద్ధి చేస్తాం.
మేనిఫెస్టోను అమలు చేస్తా..
మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు తీసుకొచ్చేలా కృషి చేస్తా. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తా. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డిల సహకారంతో సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తా. ఈ ఎన్నికల్లో పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోను అమలు చేస్తాం.
ఆదర్శంగా తీర్చిదిద్దుతా


