మూడున్నరేళ్లుగా నిధుల్లేక!
రైతు వేదికల నిర్వహణకు సంబంధిచిన నిధులు పెండిగ్‌లో ఉన్న మాట వాస్తవమే. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నందున ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అందజేస్తాం.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
అనంతగిరి : పంటల సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన సదస్సు నిర్వహించేందుకు రెండు మూడు గ్రామాలను ఒక క్లస్టర్‌గా చేసి గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. జిల్లాకు 82 రైతు వేదికలు మంజూరు చేయగా 79 క్లస్టర్లలో రైతువేధికలు అందుబాటులో ఉన్నాయి. సూర్యాపేట డివిజన్‌లోని నెమ్మికల్లు, తుంగతుర్తి డివిజన్‌లోని నాగారం, తుంగతుర్తి క్లస్టర్ రైతువేదికలు వివిధ కారణాల వల్ల అందుబాటులోకి రాలేదు. జిల్లాలో వ్యాప్తంగా 82 మంది ఏఈఓలు రైతులకు సేవలు అందిస్తుండగా ఇందులో 13 మంది కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నారు. 2022లో ఏప్రిల్ నుంచి వరుసగా ఐదు నెలలకు సంబంధించిన రైతు వేదికల నిర్వహణకు నెలకు రూ.9వేల చొప్పున రూ.36.90 లక్షల నిధులను ప్రభుత్వం మూడు దఫాలుగా విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి నేటివరకు దాదాపు 42 నెలలకు (మూడున్నరేళ్లకు) సంబంధించి రైతు వేదికల నిర్వహణకు నిధులు విడుదల కాలేదు. దీంతో వ్యవసాయ విస్తరణ అధికారులు తమ సొంత ఖర్చులతో వాటిని నిర్వహిస్తున్నారు.
మౌలిక వసతులూ కరువే..
ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో రైతు వేదికల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. రైతు వేదికల్లో నీటి సౌకర్యం కల్పించకపోవడంతో టాయిలెట్స్, మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దీనికితోడు మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడంతో శిక్షణ సమయంలో వచ్చే మహిళా రైతులతోపాటు వేదికల్లో విధులు నిర్వహించే మహిళా ఏఈఓలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఏఈఓలకు ఇంటర్నెట్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లకు రీచార్జి చేయడంలేదని తమ సొంత ఫోన్‌ల ద్వార నెట్ సర్వీస్‌లను వినియోగించుకోవాల్సి వస్తుందంటున్నారు.
ఔట్‌సోర్సింగ్ ఏఈఓలకు అందని జీతాలు
ఇదిలా ఉండగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 13 మంది ఏఈఓలకు 2025 జూన్ నెల నుంచి జీతాలు అందకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. తమ ఆర్థిక ఇబ్బందులను జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పరిష్కరించడం లేదని వారు వాపోతున్నారు. 2022 సెప్టెంబర్ నుంచి రైతువేదికల నిర్వహణకు చేసిన ఖర్చులను వెంటనే విడుదల చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఏఈఓలు విన్నవిస్తున్నారు.
భారంగా రైతు
వేదికల నిర్వహణ
సమకూరని కనీస వసతులు
సొంత ఖర్చులతో నెట్టుకొస్తున్న ఏఈఓలు
బిల్లులు విడుదల చేయాలని వేడుకోలు
జిల్లా వ్యాప్తంగా 79 రైతు వేదికలు
ఒక్కో రైతు వేదికకు నిర్వహణ ఖర్చు (రూ.లో)
విద్యుత్ బిల్లు 1000
తాగునీటితో సహ నీటిబిల్లు 500
హౌస్‌కీపింగ్, వాచ్
అండ్ వార్డ్ చార్జీలు 3,000
జిరాక్స్, స్టేషనరీ ఖర్ఛులు 1000
శిక్షణ కార్యక్రమాలకు 2,500
ఇతర అవసరాలు 1000
మొత్తం 9,000
మూడున్నరేళ్లుగా నిధుల్లేక!


