రోబోటిక్స్ తయారు చేసేలా తీర్చిదిద్దాలి
సీనియర్ విభాగంలో ఏడు..
హుజూర్‌నగర్ : రాబోయే 10 ఏళ్ల తర్వాత విద్యార్థులు నూతన ఆలోచనలతో రోబోటిక్స్ తయారు చేసే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. హుజూర్‌నగర్‌లోని వీవీఎం పాఠశాలలో ఏర్పాటు చేసిన 53 వ జిల్లా స్థాయి విద్యా, బాల వైజ్ఞానిక ప్రదర్శన–2025 బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతానికి చెందిన చిన్నారులు ఇప్పుడే పరికరాలను ఉపయోగించి కోతుల బెడదలాంటి సమస్యను పరిష్కరిస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై మరింత అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచన, సజనాత్మకత, పరిశోధనా దక్పథం పెంపొందించేందుకు విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన ఉపయోగ పడుతుందన్నారు. విద్యార్థులు సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం, గ్రీన్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీ, వినోదాత్మక గణిత నమూన నిర్మాణం, ఆరోగ్యం పరిశుభ్రత, నీటి సంరక్షణ తదితర అంశాలపై నూతన ఆలోచనలతో ఎగ్జిబిట్లు రూపొందించి ప్రదర్శించడం అభినందనీయమని పేర్కొన్నారు. 2026లో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కలెక్టర్.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను కలెక్టర్ తిలకించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డీఈఓ ఆశోక్, తహసీల్దార్ కవిత, ఎంపీడీఓ సుమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి ఎల్. దేవరాజ్, ఎంఈఓలు సైదా నాయక్, సలీం షరీఫ్, ఛత్రూ నాయక్, వెంకటాచారి, సత్యనారాయణ రెడ్డి, కాటయ్య, వెంకటరెడ్డి, శ్రీనివాస్, గురవయ్య, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, గెజిటెడ్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
సైన్స్ ఫెయిర్‌లో ఇన్‌స్పైర్ ప్రాజెక్టులు 64, సైన్స్ ఫెయిర్‌కు సంబంధించినవి 254 ఇలా మొత్తం 318 ఎగ్జిబిట్లను విద్యార్థులు ప్రదర్శించారు. జిల్లా సైన్స్ అధికారి ఎల్. దేవరాజ్ ఆధ్వర్యంలో సెలెక్షన్ కమిటీ ఉత్తమ ఎగ్జిబిట్లను ఎంపిక చేసింది. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఇన్‌స్పైర్ ప్రాజెక్టులు 6, సెన్స్ ఫెయిర్‌లో సీనియర్ విభాగం నుంచి 7, జూనియర్ విభాగం నుంచి 7, టీచర్ ఎగ్జిబిట్ ఒకటి చొప్పున, సెమినార్ ఒకటి మొత్తం 22 ఎగ్జిబిట్లను ఎంపిక చేశారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
ఫ ముగిసిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్
ఫ రాష్ట్రస్థాయికి 22 ఎగ్జిబిట్లు ఎంపిక
రోబోటిక్స్ తయారు చేసేలా తీర్చిదిద్దాలి
రోబోటిక్స్ తయారు చేసేలా తీర్చిదిద్దాలి
రోబోటిక్స్ తయారు చేసేలా తీర్చిదిద్దాలి


