హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
భానుపురి (సూర్యాపేట) : కోదాడలో దళితుడు కర్ల రాజేష్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌కు రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కర్ల రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్‌ఐని డిస్మిస్ చేయాలన్నారు. సీఐ, డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజేష్ రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉందని, నిపుణులతో రాజేష్ మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని కోరారు. జైభీమ్ సినిమా మాదిరిగా పోలీసుల కుట్రలు ఉన్నాయని, రాజేష్‌ను చిత్రహింసలు పెట్టి ఎలాగైనా చనిపోయేలా ఉన్నాడన్న తొందరలో కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. చిలుకూరు ఎస్‌ఐని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ కేసును కనుమరుగయ్యేలా చేయాలని చూస్తున్నారని, మరింత ప్రజా ఉద్యమంలా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. జనవరి 10వ తేదీన కోదాడలో కర్ల రాజేష్ సంతాపసభ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, సామాజిక న్యాయం కోరే ప్రజాసంఘాలతో తమ పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. తమ విన్నపాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చెపన్పారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి బచ్చలకూర వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ, సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మందకృష్ణమాదిగ


