మరింత మెరుగైన సేవలు అందిస్తాం
సూర్యాపేటటౌన్ : కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందిస్తాం. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంతో ప్రజలకు చేరువయ్యాం. బాధితులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నారు. గతంతో పోలిస్తే 2025లో 82 శాతం ఫిర్యాదుల సంఖ్య పెరిగింది. 2026లోనూ ఇది కొనసాగిస్తాం. డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి, రోడ్డు ప్రమాదాలు నిర్మూలించడానికి, సైబర్ నేరాలు నిరోధించడానికి, మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చి పని చేస్తూ ముందుకెళ్తాం. 2026లో ప్రజలందరికీ శుభం కలగాలి. జిల్లా పోలీసు శాఖ తరఫున ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. – నరసింహ, జిల్లా ఎస్పీ


