కొత్త ఆశయాలతో..
సూర్యాపేట జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం –2026 శుభాకాంక్షలు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలను జనంలోకి తీసుకెళ్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడడమే ధ్యేయం. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలి. ప్రత్యేకంగా లక్ష్యాలంటూ ఏమీ లేకున్నా.. ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలకు మేలు చేయడం కోసం నిరంతరం పనిచేస్తా. వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తా.
– కె.సీతారామారావు, అదనపు కలెక్టర్
నూతన ఏడాదిలో ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు జిల్లాలో 100 శాతం అమలు చేసేందుకు నావంతు కృషి చేస్తా. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రజలు పడే ఇబ్బందులను పరిష్కరించేందుకు ముందుంటాం. గ్రామాల్లో కొలువు దీరిన సర్పంచులను ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నడిపిస్తాం. – యాదగిరి, డీపీఓ
ఫ నూతన సంవత్సరంలో జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నిలుపుతాం
ఫ ప్రజలకు మెరుగైన సేవలు
అందించేలా ప్రణాళిక
ఫఅధికారుల మనోగతం
కొత్త ఆశయాలతో..
కొత్త ఆశయాలతో..


