కాలం కలిసొచ్చినా..!
యాసంగి–2024
సాగు విస్తీర్ణం (ఎకరాల్లో..)
వానాకాలం–2025
సాగు (ఎకరాల్లో..)
రైతు భరోసా నిధుల విడుదల ఇలా..
భానుపురి (సూర్యాపేట) : రైతులకు 2025 సంవత్సరం కలిసొచ్చింది. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాయి. అయినప్పటికీ రైతులు పడరాని పాట్లు పడ్డారు. ప్రధానంగా యూరియా కోసం తెల్లవార్లూ జాగారం చేసిన సందర్భాలు ఉన్నాయి. వరికోత దశలో కురిసిన అకాల వర్షాలతో కొందరు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక పత్తి విక్రయంలో ప్రభుత్వాలు తెచ్చిన విధానాలతో రైతులు కొత్త సమస్యలను ఎదుర్కొన్నారు. మొత్తంగా ప్రకృతి సహకరించినా.. ప్రభుత్వ విధానాలు, అమలు కారణంగా రైతులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఇక రైతులందరికీ రైతు భరోసా నిధులు ఆర్థికంగా ఊరట కలిగింది. సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 చొప్పున ప్రభుత్వం అందించిన బోనస్ కారణంగా సన్నరకాల వరిసాగు పెరిగింది.
సాగు ఇలా సాగింది..
2025వ సంవత్సరంలో మొదటగా వచ్చిన 2024 యాసంగి సీజన్‌లో 4,98,864 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. 99 శాతం మేర వరి 4,96,068 ఎకరాల్లో సాగైంది. బోరుబావులతోపాటు నాగార్జున సాగర్, మూసీ, ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిని అందించారు. 2025 వానాకాలం 4,94,470 ఎకరాల్లో వరి, 96,823 ఎకరాల్లో పత్తి సాగైంది. ఇతర పంటలన్నీ కలిపి మొత్తంగా జిల్లాలో 5,94,944 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. యాసంగి సీజన్‌లో ఎస్సారెస్పీ ఆయకట్టుకు సమృద్ధిగా నీటి విడుదల లేకపోవడంతో చాలావరకు వరిపొలాలు ఎండిపోయాయి. యాసంగి సీజన్‌లో అకాల వర్షాలతో 1,104 ఎకరాల్లో 662 మంది, ఈ ఏడాది అక్టోబర్‌లో మోంథా తుపాన్‌తో 3,099.89 హెక్టార్లలో 8195 మంది రైతులు పంట నష్టపోవాల్సి వచ్చింది.
రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం
రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పేరుతో కొనసాగించింది. 2024 యాసంగిలో 2,44,423 మంది రైతులకు రూ.232.92 కోట్లు అందాయి. 2025 వానాకాలంలో 2,87,234 మంది రైతులకు రూ.366.50 కోట్లను పెట్టుబడి సాయం అందింది. 2024లో రూ.2 లక్షల రుణమాఫీ చేసింది. రైతుబీమా కింద 272 మంది రైతులకు రూ.10.05 కోట్లు విడుదల చేసింది.
యూరియా కోసం పడిగాపులు
ఈ వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా యూరియా కోసం ఇబ్బందులు పడని రైతంటూ ఎవరూ లేరు. దాదాపు నెలరోజుల పాటు సమస్య తీవ్రంగా ఉంది. రైతులు మిగతా పనులు మానుకుని రాత్రి పగలు క్యూలైన్లలో వేచిఉండి యూరియా తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్రాప్‌బుకింగ్, ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి కొనుగోలు విధానాలతో పంట విక్రయానికి ఇక్కట్లు పడుతున్నారు.
బోనస్‌తో సన్నాలసాగు వైపు..
వరిలో సన్నరకాలకు క్వింటాకు ప్రభుత్వం రూ.500ల బోనస్ ఇవ్వడంతో ఈ పంట సాగు విస్తీర్ణం పెరిగింది. గత యాసంగిలో 2,63,250 ఎకరాల్లో సన్నాలను సాగు చేయగా.. ఈ వానాకాలం 3,86,093 ఎకరాల్లో సాగుచేశారు. ప్రభుత్వం 2025 వానాకాలం కింద ఇప్పటి వరకు 41,519 మంది రైతుల వద్ద కొనుగోలు చేయగా, వీరికి రూ.100.49 కోట్ల బోనస్ రావాల్సి ఉండగా రూ.49.64 కోట్లు చెల్లించింది. వరిసాగులో రైతులు డ్రమ్‌సీడర్, వెదజల్లే పద్ధతులు అవలంబించారు.
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో
వర్షాలకు దెబ్బతిన్న వరిపొలం (ఫైల్)
యూరియా కోసం అర్వపల్లి పీఏసీఎస్ వద్ద రోడ్డుపై క్యూకట్టిన రైతులు (ఫైల్)
మొత్తం 4,98,864
వరి 4,96,068
దిగుబడి 12,05,396 మెట్రిక్ టన్నులు
మొత్తం 5,94,944
వరి 4,94,470
పత్తి 96,823
వరి దిగుబడి 11,96,887 మెట్రిక్ టన్నులు
పత్తి దిగుబడి 9.70 లక్షల క్వింటాళ్లు
2025లో రైతులను వెంటాడిన కష్టాలు
ఫ యూరియా కోసం పడరాని పాట్లు
ఫ పత్తి అమ్మకంలోనూ ఇబ్బందులే..
ఫ రైతు భరోసా నిధులతో ఊరట
ఫ బోనస్‌తో పెరిగిన సన్నాల సాగు
సీజన్ రైతుల సంఖ్య విడుదలైన నిధులు
యాసంగి–2024 2,44,423 రూ.232.92 కోట్లు
వానాకాలం–2025 2,87,234 రూ.366.50 కోట్లు
కాలం కలిసొచ్చినా..!
కాలం కలిసొచ్చినా..!


