టాప్రా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో శనివారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్(టాప్రా) జిల్లా మహాసభ జరిగింది. ఈ సందర్భంగా టాప్రా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా యరమాద వెంకటేశ్వర్లు, అధ్యక్షుడిగా బెడద సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా మన్నె యాదగిరి, ఉపాధ్యక్షులుగా వెంకట్రాంరెడ్డి, ముషం నరసింహ, శివ రామయ్య, దేవశెట్టి పద్మ, కార్యదర్శులుగా బీఆర్ భూషణం, జె.దేవరాజు, ప్రసాద్‌రావు, సత్యనారాయణ, కోశాధికారిగా ఆర్.సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా కమ్మంపాటి అంజయ్య, జమాలుద్దీన్, రామచంద్రయ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీతారాం, ఎల్.రాణి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
రాజకీయంగా ఎదగాలి
కోదాడరూరల్ : ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా అన్నారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న ఎర్ర శ్రీనివాస్ శనివారం కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, పైడిమర్రి సత్తిబాబు, నారాయణరావు, వెంకటనారాయణ, ఓరగంటి ప్రభాకర్, నీలా సత్యనారాయణ, ఇమ్మడి రమేష్, రాయపూడి వెంకటనారాయణ, వెంపటి మధు, ఓరుగంటి కిట్టు, కుక్కడపు బాబు, యాదా సుధాకర్, అశోక్ పాల్గొన్నారు.
రాజేష్ కుటుంబానికి
అండగా ఉంటాం
కోదాడ : అనుమానాస్పద స్థితిలో మరణించిన కోదాడకు చెందిన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు డపుకు మల్లయ్య అన్నారు. శనివారం కోదాడలోని కర్ల రాజేష్ ఇంటికి వచ్చిన ఆయన రాజేష్ తల్లి లలితమ్మను పరామర్శించి మాట్లాడారు. రాజేష్ మృతికి కారకులైన వారందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎమ్మార్పీస్ అధికార ప్రతినిధి ఏపూరి రాజు, కోదాడ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు దావీద్, మందుల శ్రీనివాస్, మీసాల శ్రీనివాస్, నవీన్, అంజిబాబు, వంశీ, కర్ల కమల్, కుడుముల వెంకటయ్య ఉన్నారు.
టాప్రా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
టాప్రా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
టాప్రా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక


