ముగిసిన బాలోత్సవ్
కోదాడ: బాలల వికాసానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ సంఘం దివంగత నేతడు బజ్జూరి నర్సిరెడ్డి జ్ఞాపకార్థం నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోదాడ పబ్లిక్‌క్లబ్ ఆవరణలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న బాలోత్సవ్ ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకుబహుమతులు అందజేశారు. నేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు పప్పుల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకుడు సుంకరి భిక్షం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వంగవీటి రామారావు, కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్, బజ్జూరి వెంకట్‌రెడ్డి, రావెళ్ల సీతారామయ్య, సాదె లక్ష్మీనారాయణ, కీతా వెంకటేశ్వర్లు, బజ్జూరి భాస్కర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన బాలోత్సవ్


