
నేడు, రేపు ఎన్జీ కాలేజీలో జాతీయ సదస్సు
రామగిరి (నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ కాలేజీ)లో సోమవారం, మంగళవారం శ్రీసుస్థిర అభివృద్ధి లక్ష్యాలు జీవశాస్త్రాల పాత్రశ్రీ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, సదస్సు సంచాలకులు ఎం. అనిల్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ సమావేశంలో ముఖ్యఅతిథిగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగం ఆచార్యులు రామాచారి పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు సదస్సుకు హాజరుకావాలని కోరారు.
కెనడాలో
యాదగిరీశుడి కల్యాణం
యాదగిరిగుట్ట: కెనడా దేశంలోని విండ్సర్ నగరంలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆహ్వానంతో రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు విండ్సర్ నగరంలో సంప్రదాయ పద్ధతిలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని ఆలయ రిటైర్డ్ ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, ఆలయ అధికారి గజవెల్లి రఘు ఆధ్వర్యంలో జరిపించారు. ఈ వేడుకకు విండ్సర్ నగరం ఎంపీ అండ్ర డోవి, ఎంపీపీ అర్బెగిల్‌తో పాటు స్థానిక ఎన్‌ఆర్‌ఐలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదగిరీశుడి సేవలో
అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ జనరల్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ జనరల్ రఘునందన్, కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఈఓ వెంకట్రావ్‌లు వారికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూలను, ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులను దర్శించుకొని పూజలు నిర్వహించారు. వారికి అర్చకులు ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ వెంకట్రావ్ లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందజేశారు.
వ్యాపారంలో నష్టం
రావడంతో ఆత్మహత్య
దేవరకొండ: వ్యాపారంలో నష్టం రావడంతో మనోవేదనకు గురై ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో ఆదివారం జరిగింది. దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తాటికోల్ గ్రామానికి చెందిన నాయిని భాస్కర్(55) గ్రామంలో ఫర్టిలైజర్, కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండేళ్లుగా భాస్కర్ నిర్వహిస్తున్న వ్యాపారంలో నష్టం రావడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తెల్ల వారుజామున ఫర్టిలైజర్ దుకాణంలో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి కుమారుడు అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.