
అట్టపెట్టెల మాటున మూగజీవాల రవాణా
చౌటుప్పల్ రూరల్: అట్టపెట్టెల మాటున మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తుండగా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంత నుంచి 12 ఆవు దూడలు, 21 ఎద్దు దూడలను కొనుగోలు చేసి గూడ్స్ వాహనంలో హైదరాబాద్‌లోని బహదూర్‌పురా కబేళాకు తరలిస్తుండగా.. పక్కా సమాచారం మేరకు ఆదివారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్ పెద్దపూడి అప్పలకుమారస్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ఐదు ఎద్దులు.. నాలుగు ఆవులు
చౌటుప్పల్: కోదాడ సంతలో కొనుగోలు చేసిన ఐదు ఎద్దులు, నాలుగు ఆవులను గూడ్స్ ఆటోలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. కోదాడ ప్రాంతంలోని జగన్‌నాయక్ తండాకు చెందిన వాహనం డ్రైవర్ బానోతు సురేందర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మన్మథకుమార్ తెలిపారు.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద
పట్టుకున్న పోలీసులు