
కనువిందు చేస్తున్న రాచకొండ వాటర్ ఫాల్స్
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయపురం మండల పరిధిలోని రాచకొండ అటవీ ప్రాంతంలో పల్లగట్టుతండా, గంగమూలతండా పరిధిలో వాటర్ ఫాల్స్ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఇటీవల కురిసన వర్షాలకు రాచకొండ గుట్టల్లో నుంచి జాలువారుతున్న నీరు మల్కాచెర్వు, గంగకుంటలోకి వస్తున్నాయి. గుట్టలు, చెట్ల మధ్యలో నుంచి జాలువారే నీటిని చూసేందుకు ఆదివారం పెద్దఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. యువకులు నీటిలో ఈత కొడుతూ ఆనందంగా గడిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు పర్యాటకులను హెచ్చరిస్తూ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

కనువిందు చేస్తున్న రాచకొండ వాటర్ ఫాల్స్