
డెంగీ పంజా..
న్యూస్‌రీల్
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025
పార్వతి తనయ..
ముస్తాబు చేస్తుంటిమయా
సూర్యాపేటటౌన్ : డెంగీ పంజా విసురుతోంది. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నెలలోనే 15 డెంగీ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలు కురిసి దోమలు వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
జ్వరంతో ఆస్పత్రుల బాట
జిల్లాలో వర్షాలు విస్తారంగా కురిశాయి. అపరిశుభ్ర పరిసరాలతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో విష జ్వరాలు, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓపీ(ఔట్‌పేషెంట్ల) సంఖ్య పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో ఆగస్టు(ఈ నెల)లోనే 15 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇవి వైద్యాధికారులు గుర్తించినవి మాత్రమే. ఇంకా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించుకునే వారిలో కేసులు అధిక సంఖ్యలోనే ఉన్నాయి. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రులతో పాటు హైదరాబాద్, ఖమ్మం లాంటి నగరాల్లో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.
కిట్లు అందుబాటులో ఉన్నా..
డెంగీని నిర్ధారించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కిట్లు అందుబాటులో ఉన్నా పరీక్షలు మాత్రం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో అత్యధికంగా ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఈ ఏడాది ఇప్పటి వరకు 50కి పైగా డెంగీ కేసులు
ఫ ఈ నెలలోనే అత్యధికంగా 15 కేసులు
ఫ డెంగీతో పాటు వైరల్ ఫీవర్
ఫ ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం
ఫ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
నమోదైన డెంగీ కేసులు
జనవరి నుంచి
జూన్ వరకు 30
జూలై 05
ఆగస్టు 15
ఈ ఫొటోలో కన్పిస్తున్న విద్యార్థి పేరు ధరావత్ హర్ష. సొంతూరు చివ్వెంల మండలం మున్యానాయక్ తండా. ఇతడు ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతూ ఎస్సీ హాస్టల్‌లో ఉంటున్నాడు. వారం రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో ఇంటికి వెళ్లాడు. తల్లిదండ్రులు చికిత్స చేయించారు. జ్వరం తగ్గిందనుకొని ఈనెల 21న స్కూల్‌కు వెళ్లాడు. మధ్యాహ్నానికి జ్వరం తీవ్రత పెరగడంతో మళ్లీ ఇంటికి వెళ్లిపోయాడు. హర్షను చివ్వెంల పీహెచ్‌సీలో శనివారం పరీక్షలు చేయించగా డెంగీ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రజలు ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ ఉన్నట్టు నిర్ధారణ అయితే ఆ పరిసరాల్లోని 50 ఇళ్ల కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహిస్తాం. చుట్టు పక్కల బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తాం. గ్రామాల్లో ప్రతి శుక్రవారం ఆశా వర్కర్లు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన నిర్వహిస్తున్నారు.
– డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్‌ఓ

డెంగీ పంజా..

డెంగీ పంజా..

డెంగీ పంజా..