
చట్టాలపై అవగాహన అవసరం
చివ్వెంల(సూర్యాపేట): విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం అని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గండూరి జానకమ్మ మెమోరియల్ (జీజేఎమ్) పాఠశాలలో విలేజ్ లీగల్ కేర్, సపోర్ట్ సెంటర్ (వీలేజ్ లీగల్ సర్వీస్ క్లినిక్)ను ప్రారంభించి మాట్లాడారు. దీని ద్వారా విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని, తద్వారా వారు గ్రామాల్లోని వారి తల్లిదండ్రులకు చట్టాల గురించి తెలియజేస్తారన్నారు. సెంటర్ నిర్వహణకు న్యాయవాదితో పాటు, పారాలీగల్ వలీంటర్, నలుగురు విద్యార్థులతో టీమ్ ఏర్పాటు చేస్తామన్నారు. చట్టాలు అందరికీ చుట్టాలు అని, చుట్టాలు మనకు రక్షణతో పాటు, అధికారాన్ని ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటెడ్ సభ్యులు అల్లంనేని వెంకటేశ్వర్‌రావు, గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, పెండెం వాణి, బార్ అసోసియేషన్ ఈసీ సభ్యులు పాల్గొన్నారు.
13న జాతీయ లోక్‌అదాలత్
వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద వెల్లడించారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కక్షిదారులు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్‌అదాలత్‌లో క్రిమినల్, సివిల్, మోటర్ వెహికల్, విద్యుత్, బ్యాంకు, గృహహింస, ఎకై ్సజ్ వంటి కేసులను పరిష్కరించుకోవచ్చున్నారు. దీని ద్వారా ఇరు పక్షాలవారు గెలుపొందిన వారవుతారన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.వెంకటరమణ, న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద