
బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత
చివ్వెంల(సూర్యాపేట) : బాల్య వివాహల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ పేర్కొన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలనపై ఆశావర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించారు. బాల్య వివాహల నిర్మూలనకు ఏవిధంగా కృషి చేస్తున్నారని వారికి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూఓ రమణారావు, డీసీపీఓ రవికుమార్, ఆశావర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
‘అగ్రి’ కళాశాలకు
భూములు ఇవ్వం
హుజూర్‌నగర్ : వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు తాము సాగుచేసుకుంటున్న భూములు ఇవ్వబోమని పలువురు రైతులు స్పష్టం చేశారు. హుజూర్‌నగర్ పట్టణ శివారులోని మగ్దూం నగర్ వద్ద 1041 సర్వేనంబర్‌లో గల వ్యవసాయ భూమి వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు సర్వే చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుమందుల డబ్బాలతో పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఇన్‌చార్జి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మగ్దూం నగర్ వద్ద 1041 సర్వేనంబర్‌లో గల వ్యవసాయ భూమిలో అగ్రికల్చరల్ కాలేజీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం అని తెలిపారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో 1041 సర్వే నంబర్ భూమిని సాగుచేసుకుంటున్న రైతులు పాల్గొన్నారు.

బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత