పల్లెలు మురిసేలా.. | - | Sakshi
Sakshi News home page

పల్లెలు మురిసేలా..

Aug 24 2025 9:53 AM | Updated on Aug 24 2025 9:53 AM

పల్లెలు మురిసేలా..

పల్లెలు మురిసేలా..

గ్రామీణ ప్రజల జీవనోపాధికే పనుల జాతర

భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పనుల జాతర – 2025 కార్యక్రమం ప్రారంభమైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కూలీల జీవనోపాధి మెరుగుపరచడానికి, ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల పని కల్పించడానికి వివిధ రకాల పనులు చేపట్టారు. జిల్లాలో రెండో విడతగా ఈ పనులు ప్రారంభించడమే కాకుండా కొత్త పనులకు భూమి పూజ చేశారు. వచ్చే సంవత్సరం మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు.

రూ.391 కోట్లు.. 356 పనులు

పనుల జాతర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రూ.391 కోట్లతో చేపట్టిన 356 పనులను ప్రారంభించారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ పనులు ప్రారంభం కాగా చివ్వెంల మండలంలో కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, మునగాల మండలంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, తుంగతుర్తి మండలంలో మందుల సామెల్‌ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇవే కాకుండా కొత్తగా రూ.1.54 కోట్లతో 187 పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనులతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి పనుల జాతరలో మరిన్ని పనులు చేపట్టి పూర్తి చేయాలన్న కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. పశువులు, గొర్ల షెడ్లు, కోళ్ల ఫామ్‌లు, కొత్తగా వ్యవసాయ బావుల నిర్మాణం, వన మహోత్సవం ద్వారా ఈత, తాటి, పండ్ల తోటల పెంపకం, నూతన అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ, సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

మెరుగవనున్న పాలన

గ్రామపంచాయతీలో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన అనంతరం పల్లె పాలన పడకేసింది. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతున్నా.. అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం శుక్రవారం చేపట్టిన పనుల జాతరతో పల్లెల్లో నూతన పనులు ప్రారంభమై పాలన మెరుగుపడనుంది. ఓవైపు అభివృద్ధి పనులే కాకుండా వ్యక్తిగతంగా ఉపాధి హామీ కూలీలకు ఉపాధి దొరకనుంది.

ఫ పనుల జాతర – 2025

రెండో విడత ప్రారంభం

ఫ వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

ఫ ఆయా ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న కలెక్టర్‌, ఎమ్మెల్యేలు

చివ్వెంల(సూర్యాపేట) : గ్రామీణ ప్రాంత ప్రజల జీవనోపాధిని పెంచడానికి ప్రభుత్వం పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు. చివ్వెంల మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామానికి చెందిన వడ్డెపల్లి రాములు నిర్మించుకున్న పశువుల పాకను శుక్రవారం కలెక్టర్‌ ప్రారంభించారు. పశువుల వివరాలు, పాడి ద్వారా వస్తున్న ఆదాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన యల్కపల్లి ప్రమీల నిర్మించుకుంటున్న పశువుల పాక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జెడ్పీహెచ్‌ఎస్‌లో వాన నీటి సంరక్షణ కట్టడం పనులు ప్రారంభించారు. కలెక్టర్‌ వెంట డీఆర్డీఓ వీవీ అప్పారావు, పంచాయతీ అధికారి నారాయణరెడ్డి, తహసీల్దార్‌ ప్రకాశ్‌రావు, ఎంపీడీఓ సంతోష్‌ కుమార్‌, ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement