
చెట్టును ఢీకొట్టిన లారీ..
చీనెమ్మికల్‌లో బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.
పూర్తిస్థాయి నీటి మట్టం :
590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 585.30 అడుగులు
ఇన్‌ఫ్లో : 2,10,499 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 1,83,786 క్యూసెక్కులు
విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 29,070 క్యూసెక్కులు
కుడికాల్వ ద్వారా : 8,023 క్యూసెక్కులు
ఎడమకాల్వ ద్వారా : 7,937 క్యూసెక్కులు
ఏఎమ్మార్పీకి : 1,800 క్యూసెక్కులు
వరద కాల్వకు : 300 క్యూసెక్కులు
బైక్ దొంగల రిమాండ్
ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న దొంగలను నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
- 8లో
14 మంది ఎస్‌ఐల బదిలీ
సూర్యాపేటటౌన్ : జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 14 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ మల్టీజోన్– 2 ఇన్‌చార్జి ఐజీ తఫ్సీర్ ఇక్బాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ నల్లగొండలో ఉన్న ఆర్.నాగరాజును నూతనకల్ పీఎస్‌కు, నూతనకల్ ఎస్‌ఐ వి.ప్రవీణ్‌కుమార్‌ను డీఐజీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. కోదాడ టౌన్ పీఎస్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ ఎస్‌కె.సైదులును పీసీఆర్ సూర్యాపేటకు, వీఆర్ సూర్యాపేటలో ఉన్న బి.హనుమాన్‌ను కోదాడ టౌన్ పీఎస్‌కు, కోదాడ పీఎస్‌లో పని చేస్తున్న వి.మల్లేశంను వీఆర్ సూర్యాపేటకు, వీఆర్ సూర్యాపేటలో ఉన్న బి.అంజిరెడ్డిని కోదాడ ట్రాఫిక్ పీఎస్‌కు, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఐ.మహేంద్రనాథ్‌ను సూర్యాపేట టౌన్ –1 పీఎస్‌కు, వీఆర్ సూర్యాపేటలో ఉన్న బి.యాదవేందర్‌రెడ్డిని సీసీఎస్ సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఎస్.రాంబాబును డీఎస్‌బి సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఎం.ఆంజనేయులును డీఎస్‌బీ సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఎం.అనిల్‌రెడ్డిని సీసీఎస్ సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఎ.తేజస్వినిని డీఎస్‌బీ సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఎ.ఝాన్సీరాణిని డీఎస్‌బీ సూర్యాపేట, వీఆర్ సూర్యాపేటలో ఉన్న ఆర్.డాక్యానాయక్‌ను పీసీఆర్ సూర్యాపేటకు బదిలీ చేశారు.
సర్వీస్ నిబంధనపై స్పష్టత కరువు
కొత్త పోస్టుల భర్తీ నిబంధనల్లో పాత సర్వీస్‌పై స్పష్టత లేకుండా పోయింది. పే స్కేల్ విధివిధానాలు పేర్కొనలేదు. వీటిపై అనుమానాలు ఉండడంతో చాలామంది జీపీఓ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మొదట్లో వెనుకంజ వేశారు. అయితే విద్యార్హత ఉన్నవారంతా ఎంపిక పరీక్షకు హాజరయ్యారు. పాత సర్వీస్ యాడ్ చేయకపోయినా.. వీరంతా ఆసక్తి కనబర్చడం విశేషం. ఇక మంచి శాఖల్లో చేరిన వారు, రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న వారంతా తమ సర్వీస్‌ను కోల్పోయేందుకు ఇష్టపడడం లేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఎంపిక పరీక్ష రాసిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించం
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ హెచ్చరించారు. శనివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన సిబ్బంది, సమయానికి రాని డాక్టర్లు, సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చిన, విధులకు హాజరు కాని సిబ్బందికి సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అత్యవసర చికిత్స విభాగంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగితో మాట్లాడారు. బ్లడ్ బ్యాంకును సందర్శించి ఎన్ని యూనిట్ల రక్తం నిలువ ఉందని ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్, ఆర్‌ఎంఓ విజయకుమార్, డాక్టర్లు విజయానంద్, లక్ష్మణ్ ఉన్నారు.
పోలీస్ సిబ్బంది ఒత్తిడికి గురికావొద్దు
సూర్యాపేటటౌన్ : విధుల నిర్వహణలో పోలీస్ సిబ్బంది ఒత్తిడికి గురి కావొద్దని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ వాలీబాల్ కోర్టును ఎస్పీ నరసింహతో కలిసి శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్న కుమార్, శ్రీధర్ రెడ్డి, సీఐలు వెంకటయ్య, రాజశేఖర్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
ఫ సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి తనిఖీ