వాగు కషా్టలకు చెక్!
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి సొంతూరు తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామస్తుల ఎన్నో ఏళ్ల కలనెరవేరనుంది. తమ పంటపొలాలతో పాటు ఇతర గ్రామాలకు వెళ్లడానికి వాగుదాటే కష్టాలు త్వరలో తీరనున్నాయి. గ్రామ సమీపంలోని బిక్కేరువాగు(యశ్వంతపూర్‌వాగు)పై బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఇటీవల రూ.16కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే. కాగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు.
పొలాల వద్దకు వెళ్లాలంటే..
తాటిపాములకు చెందిన రైతుల పొలాలు బిక్కేరు వాగు అవతలి వైపు ఉన్నాయి. ఏటా వర్షా కాలంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు రైతులతో పాటు గ్రామస్తులు తమ పొలాల వద్దకు, అలాగే వస్తాకొండూర్, కొత్తపల్లి, పడిశాల గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు. కొన్నిసార్లు వాగు నుంచి వెళ్లడానికి ప్రయత్నిస్తే ఎడ్ల బండ్లు, పశువులు, మేకలు కొట్టుకుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. బ్రిడ్జి నిర్మిస్తామని ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇచ్చినాఅమలుకు నోచుకోలేదు. ఎట్టకేలకు మంత్రి ఉత్తమ్ బిక్కేరువాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.16కోట్లు, చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.7.14కోట్లు మంజూరు చేయించారు.
శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
తాటిపాములలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఉత్తమ్‌మంగళవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బిక్కేరు వాగుపై డబుల్ లేన్ రోడ్, బ్రిడ్జి, చెక్ డ్యామ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రైతులకు బిక్కేరు వాగుపై ప్రయాణించడానికి 20కి.మీ. దూరం తగ్గుతుంది. చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల 750 ఎకరాల పంట భూములకు లబ్ధి చేకూరనుంది. అలాగే చెక్ డ్యామ్ నిర్మాణం వల్ల 2కి.మీ. పరిధిలో గ్రౌండ్ వాటర్ పెరగడానికి అవకాశం ఉంది. దీని వల్ల రైతులకు బోర్లు, వ్యవసాయ బావుల్లో నీళ్లు పెరగడానికి అవకాశం ఉంది. అలాగే రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. తన సొంత నిధులతో 500 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు.
తాటిపాములలో బ్రిడ్జి నిర్మించే ప్రాంతం
తాటిపాములలో బిక్కేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి
రూ.16 కోట్లు మంజూరు
నేడు మంత్రి ఉత్తమ్ చేతులమీదుగా శంకుస్థాపన
నెరవేరనున్న ప్రజల కల
బ్రిడ్జి నిర్మాణం ఇలా..
పొడవు : 120 మీటర్లు
పిల్లర్లు : 12
వెడల్పు : 11 మీటర్లు
ఇబ్బందులు తొలగనున్నాయి
గ్రామ రైతుల పంట పొలాలు బిక్కేరు వాగు అవతలి వైపు ఉన్నాయి. వర్షా కాలంలో వాగుదాటాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి ఉత్తమ్‌నిధులు మంజూరు చేయడం శుభ పరిణామం. రాష్ట్ర మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు. బ్రిడ్జి నిర్మిస్తే ఇబ్బందులు తొలగనున్నాయి. – కోల రమేష్, తాటిపాముల
ప్రజలకు ఎంతో మేలు
వర్షా కాలంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. బ్రిడ్జి నిర్మించడం వల్ల ప్రజలకుఎంతో మేలు కలుగుతుంది. వస్తాకొండూర్, కొత్తపల్లి, పడిశాల గ్రామాలకు వెళ్లే వారికి కూడా దూరా భారం తగ్గుతుంది.
– కె.శ్రీనివాస్, రైతు, తాటిపాముల
వాగు కషా్టలకు చెక్!
వాగు కషా్టలకు చెక్!


