ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్
చివ్వెంల(సూర్యాపేట): ఖైదీలు నేర ప్రవృత్తిని వీడి, సత్ప్రవర్తనతో జీవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నచిన్న ఘర్షణలతో జైలు జీవితం గడిపేవారు.. దీనిని ఒక గుణపాఠంగా భావించి బయటకు వెళ్లాక సమాజంలో మంచి వ్యక్తులుగా జీవించాలని సూచించారు. యువత చేడు వ్యవసనాలకు బానిస కావద్దన్నారు. అనంతరం జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడి వసతులు, బెయిల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడ్వకేట్‌ను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేని వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించాలని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీవాణి, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు వసంత సత్యనారాయణ పిళ్లే యాదవ్, బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, జైలు సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.