కౌంటింగ్‌కు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

Published Sun, Dec 3 2023 1:30 AM

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎస్పీ
 - Sakshi

దురాజ్‌పల్లి (సూర్యాపేట): కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.వెంకట్రావ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే, అదనవు కలెక్టర్‌ సిహెచ్‌. ప్రియాంకలతో కలిసి ఆయన మాట్లాడారు. నాలుగు నియోజకవర్గాల కౌంటింగ్‌ హాళ్లలో 14 చొప్పున టేబుల్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తిగా సంబంధిత పరిశీలకుల సమక్షంలో జరుగుతుందన్నారు. మొదట పోస్టల్‌ బ్యాల్లెట్‌ లెక్కింపు ఉంటుందన్నారు. తదుపరి ఉదయం 8.30 ఈవీఎంల లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో సెల్‌ఫోన్‌కు అనుమతి లేదని అన్నారు. కౌంటింగ్‌ హాళ్లలోకి సంబంధిత అధికారులు ద్వారా ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ప్రతినిధులు వెళ్లేలా అనుమతించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కౌంటింగ్‌ సిబ్బందికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చామని, విధుల నిర్వహణ సిబ్బంది అంతా ఉదయం 6 గంటలకు హాజరు కావాలని, 6.30 గంటలకు కౌంటింగ్‌ ఎజెంట్లు వస్తారని, పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ 8గంటలకు లకు మొదలవుతుందని తెలిపారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో సరిపడా సిబ్బంది, రూట్లు, లోపల గ్యాలరీలు, పోస్టల్‌ బ్యాలెట్‌, వీవీ ప్యాట్ల విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ రోజున గెలిచిన అభ్యర్థుల ర్యాలీలు చేపట్టరాదని అలాగే మరుసటి రోజున ర్యాలీలు అనునమతులు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో నోడల్‌ అధికారి సతీష్‌ కుమార్‌ డీపీఆర్‌ఓ రమేష్‌ కుమార్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి

వెంకట్రావ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement