కోదాడరూరల్ : బావమరిది మరణం తట్టుకోలేక బావ ఆత్మహత్య చేసుకున్నాడు. కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామానికి చెందిన కొత్తపల్లి నర్సింహారావు(68) బావమరిది దాచేపల్లి వెంకటేశ్వర్లు మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు కావడంతో నర్సింహారావు మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే నర్సింహారావు మంగళవారం ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయిప్రశాంత్ తెలిపారు.