ఎగిరేది గులాబీ జెండానే..
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట టౌన్ : మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేటలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పలువురు కౌన్సిలర్ అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు అర్థమైందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలెప్పటికీ మరువలేరన్నారు. అందుకే ప్రజలు ఆలోచన చేసి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


