డీపీఆర్‌ఓగా బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

డీపీఆర్‌ఓగా బాధ్యతల స్వీకరణ

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

డీపీఆ

డీపీఆర్‌ఓగా బాధ్యతల స్వీకరణ

భానుపురి (సూర్యాపేట) : జిల్లా పౌర సంబంధాల నూతన అధికారి (డీపీఆర్‌ఓ)గా వి.శ్రీనివాసరావు సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావులను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ప్రారంభం

సూర్యాపేట టౌన్‌ : ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 38 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగాయి. ఉదయం సెషల్‌లో జనరల్‌ విద్యార్థులు 879 మందికి గాను 838 మంది హాజరు కాగా 41 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌ విద్యార్థులు 985 మందికి 837మంది హాజరు కాగా 148 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషల్‌లో జనరల్‌ విద్యార్థులు 730 మందికి గాను 700 హాజరు కాగా 30 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 940 మందికి గాను 851 మంది విద్యార్థులు హాజరై 89 మంది గైర్హాజరైనట్టు డీఐఈఓ భానునాయక్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

బీజేపీతోనే పారదర్శక పాలన

నేరేడుచర్ల : బీజేపీతోనే పారదర్శక పాలన సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు సోమవారం నేరేడుచర్లలోని ఆ పార్టీ కార్యాలయంలో బి–ఫారాలను అందించి మాట్లాడారు. నేరేడుచర్ల పట్టణాభివృద్ధే లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తోందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ పరిస్థితి మారాలంటే ఈ సారి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేరేడుచర్ల మున్సిపల్‌ ఎన్నికల ప్రబారీ పోతుగంటి భరత్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొణతం నాగిరెడ్డి, జిల్లా కోశాధికారి తాళ్ల నరేందర్‌రెడ్డి, అభ్యర్థులు పాల్గొన్నారు.

జిల్లా సోషల్‌ ఫోరం అధ్యక్షుడిగా వేముల సైదులు

నడిగూడెం : జిల్లా సోషల్‌ ఫోరం అధ్యక్షుడిగా నడిగూడెం మండలం తెల్లబల్లి ఉన్నత పాఠశాలకు చెందిన సోషల్‌ టీచర్‌ వేముల సైదులు ఎన్నికయ్యారు. సోమవారం సూర్యాపేటలో నిర్వహించిన ఆ సంఘం జనరల్‌ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం ప్రధాన కార్యదర్శిగా కొప్పుల కిరణ్‌, కోశాధికారిగా సుదర్శనరావు, ఉపాధ్యక్షులుగా సైదులు, వీరారెడ్డి, నాగమణి, సోమయ్య, కార్యదర్శులుగా ఎండి.హమీద్‌, సత్యనారాయణ, జ్యోతి, మరికొందరు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సైదులును తెల్లబల్లి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పద్మ, ఉపాధ్యాయులు అభినందించారు.

మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధచూపాలి

చివ్వెంల (సూర్యాపేట) : నర్సరీల్లో మొక్కల పెంపకం పట్ల అధికారులు, ఫీల్ట్‌ అసిస్టెంట్‌లు ప్రత్యేక శ్రద్ధచూపాలని డీఆర్‌డీఓ శిరీష అన్నారు. సోమవారం చివ్వెంల మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన వన నర్సరీని పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సీహెచ్‌.సంతోష్‌ కుమార్‌, ఎంపీఓ దయాకర్‌, ఏపీఓ ఇరుగు నాగయ్య, టీఏ వినోద్‌కుమార్‌, సర్పంచ్‌ ఏర్పుల కళ్యాణి, ఫీల్ట్‌ అసిస్టెంట్‌ తుర్క మల్లేష్‌, కార్యదర్శి నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

డీపీఆర్‌ఓగా బాధ్యతల స్వీకరణ1
1/3

డీపీఆర్‌ఓగా బాధ్యతల స్వీకరణ

డీపీఆర్‌ఓగా బాధ్యతల స్వీకరణ2
2/3

డీపీఆర్‌ఓగా బాధ్యతల స్వీకరణ

డీపీఆర్‌ఓగా బాధ్యతల స్వీకరణ3
3/3

డీపీఆర్‌ఓగా బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement