నీలగిరి | - | Sakshi
Sakshi News home page

నీలగిరి

Feb 3 2026 7:11 AM | Updated on Feb 3 2026 7:11 AM

నీలగి

నీలగిరి

నల్లగొండ మున్సిపాలిటీ చైర్మన్‌ల వివరాలు

నల్లని గిరుల నగరి

నల్లగొండ టూటౌన్‌ : రాజపుత్రుల పాలనలో దక్షిణ తెలంగాణలో అతి ముఖ్యమైన ప్రాంతంగా విరాజిల్లింది నల్లగొండ. చుట్టూ నల్ల ని కొండలు ఉండడంతో ఈ ప్రాంతాన్ని మొదట నల్ల కొండ అని, రాజపుత్ర రాజులు నీలగిరి (నీలిరంగు కొండ) అని పిలిచేవారు. బహమనీ రాజు అల్లావుద్దీన్‌ బహమాన్‌షా కాలంలో నల్లగొండగా మారింది. 1951లో 8 వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పడింది. క్రమంగా పట్టణం విస్తరిస్తూ 48 వార్డులతో గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా మారగా ప్రస్తుతం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటైంది.

కాంగ్రెస్‌దే ఆధిపత్యం

నల్లగొండ రాజకీయం ఎప్పుడూ రసవత్తరంగానే సాగింది. ఒకప్పుడు నల్లగొండ అంటేనే కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి యోధులు ఈ ప్రాంతం వారే. ఆ తరువాత క్రమంగా కాంగ్రెస్‌ పార్టీ బలపడుతూ వచ్చింది. నీలగిరి మున్సిపాలిటీ ఏర్పడి 75 ఏళ్లయ్యింది. 13 సార్లు జరిగిన ఎన్నికల్లో చైర్మన్‌ స్థానం 8 సార్లు కాంగ్రెస్‌ గెలుచుకోగా టీడీపీ, బీజేపీలు ఎస్‌లు ఒకసారి గెలుచుకున్నాయి. 2005లో పుల్లెంల వెంకట్‌నారాయణగౌడ్‌ రెండోసారి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికై మున్సిపల్‌ చైర్మన్ల చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు.

కార్పొరేషన్‌

తొలి మేయర్‌ మహిళే

నల్లగొండ మున్సిపాలిటీ 2026లో కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం 48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలిసారి మేయర్‌ జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. గతంలో 2014లో మున్సిపాలిటీ చరిత్రలో మొదటిసారి జనరల్‌ మహిళకు రిజర్వు అయింది. ఈ ఎన్నికల్లో బీసీ మహిళ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

ముఖచిత్రం

క్ర.సం చైర్మన్‌ పేరు సంవత్సరం పార్టీ

1. వెంకట నర్సింహారావు 1953–1961 కాంగ్రెస్‌

2. టి.వెంకటనారాయణ 1961–1967 కాంగ్రెస్‌

3. పెరిక రాజారత్నం 1967–1971 కాంగ్రెస్‌

4. చింత సాంబమూర్తి 1981–1983 బీజేపీ

5. బొర్ర సుధాకర్‌ 1983–1984 కాంగ్రెస్‌

6. కత్తుల పరుశయ్య 1984–1986 టీడీపీ

7. మద్ది విద్యాసాగర్‌రెడ్డి 1987– 1992 టీడీపీ

8. బోయినపల్లి కృష్ణారెడ్డి 1995–2000 బీజేపీ

9. పి.వెంకట్‌నారాయణగౌడ్‌ 2000–2005 కాంగ్రెస్‌

10. పి.వెంకట్‌నారాయణగౌడ్‌ 2005–2010 కాంగ్రెస్‌

11. బొడ్డుపల్లి లక్ష్మి 2014–2019 కాంగ్రెస్‌

12. మందడి సైదిరెడ్డి 2020–2024 బీఆర్‌ఎస్‌

13. బుర్రి శ్రీనివాస్‌రెడ్డి 2024–2025 కాంగ్రెస్‌

నల్లగొండ కార్పొరేషన్‌ ఓటర్ల వివరాలు

ఫ రాజపుత్రుల కాలంలో

వెలుగొందిన ప్రాంతం

ఫ నిజాం కాలంలో 1902లోనే

జిల్లాగా ఏర్పాటు

ఫ 1951లో 8 వార్డులతో

మున్సిపాలిటీ

ఫ ప్రస్తుతం 48 డివిజన్లతో కార్పొరేషన్‌

పురుషులు : 68,874

స్త్రీలు : 73,507

ఇతరులు : 56

మొత్తం : 1,42,437

తొలి జిల్లాగా నల్లగొండ

ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, కాకతీయులు, నిజాం రాజులు పాలించారు. ఆ సమయంలోనే ఉద్యమాలకు పురిటిగడ్డగా పేరొందింది. 1902లో నల్లగొండ సుభా(జిల్లా)గా ఏర్పడింది. నిజాం కాలంలో 1941లోనే నల్లగొండను ప్రధాన పట్టణంగా గుర్తించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1953లో తొలిసారి 8 వార్డులతో ఉన్న మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీ క్రమంగా అభివృద్ధి చెందుతూ 12 వార్డులకు, తర్వాత 24, 2011లో 36 వార్డులకు చేరింది. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నల్లగొండ పట్టణ శివారులో ఉన్న కొన్ని గ్రామాలను విలీనం చేసి వార్డుల సంఖ్యను 48కి పెంచారు. ఇటీవల 48 డివిజన్లతో కార్పొరేషన్‌గా ఏర్పడింది.

నీలగిరి1
1/1

నీలగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement