సాగునీటి కొరత తీర్చేలా..
రాజీవ్ లిఫ్ట్ పూర్తయి నీటిని ఎత్తిపోస్తే నేరుగా కాలువల ద్వారా సాగునీటిని పొలాల్లోకి మళ్లించుకోవచ్చు. తద్వారా ఎటువంటి ఖర్చు ఉండదు. నీరు సమృద్ధిగా అందితే పంటల దిగుబడి పెరిగి రైతులకు ఆదాయం కూడా భారీగా పెరుతుంది.
– షేక్ బాషా, శాంతినగర్ గ్రామస్తుడు
రాజీవ్ లిఫ్ట్ పనులు పూర్తికి సెప్టెంబర్ నాటికి గడువు ఉన్నప్పటికీ జూన్ వరకు పూర్తి చేసి వానాకాలం పంటకు సాగునీరు అందించే దిశగా పనులు జరుగుతున్నాయి. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ఈ ప్రాజెక్టును సాంకేతికంగా బలంగా నిర్మిస్తున్నాం.
– సత్యనారాయణ, ఇరిగేషన్ ఈఈ
రాజీవ్ లిఫ్ట్ పూర్తయితే కొత్తగూడెం మేజర్ 14–ఏ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందనుంది. ఆయకట్టు పరిధిలోని 5వేల ఎకరాలు సాగులోకి రానుంది. యాసంగి, వానాకాలంలోనూ నీరు సమృద్ధిగా అంది మా భూములు సస్యశ్యామలమవుతాయి.
– తేజావత్ వెంకటేశ్వర్లు, రైతు, కొత్తగూడెం
పాలేరు వాగులో వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టి కొత్తగూడెం మేజర్ ఆయకట్టు చివరి భూములకు సాగు నీరు అందించే రాజీవ్ లిఫ్ట్‌కు రూపకల్పన చేయడం సంతోషకరం. ఈ లిఫ్ట్‌తో ఈ ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధి చెందనుంది.
– నెల్లూరి వినయ్‌కుమార్, రైతు, గోండ్రియాల
అనంతగిరి : కోదాడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో సాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా అనంతగిరి మండలం కొత్తగూడెం మేజర్ 14–ఏ పరిధిలోని చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందిచడమే లక్ష్యంగా శాంతినగర్ శివారులోని పాలేరు వాగుపై రూ.54.03కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే లిఫ్ట్ ఏర్పాటుకు సంబంధించి రైతుల నుంచి మొత్తం 8 ఎకరాల భూమిని సేకరించి పరిహారం కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమచేశారు. ఈలిఫ్ట్ నిర్మాణం పూర్తయితే అనంతగిరి మండంలోని మొగలాయికోట, శాంతినగర్, లకారం, బొజ్జగూడెంతండా, గోండ్రియాల, కొత్తగూడెం గ్రామాలతోపాటు కోదాడ మండంలోని తమ్మర, చిమిర్యాల, మంగలితండా గ్రామాలకు రైతులకు సాగునీరు అందనుంది.
రెండు పంటలకు సాగునీరందించాలని..
కొత్తగూడెం మేజర్ 14–ఏ పరిధిలోని చివరి ఆయకట్టులో రెండు పంటలకు సరిపడా సాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పాలేరు వాగు నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 5వేల ఎకరాలకుపైగా భూములకు సాగునీరందించనున్నారు. దీంతో వేసవి, వర్షాకాలాల్లోనూ రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరందనుంది. ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఈ లిఫ్ట్ ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధపెట్టారు. ఇందులో ప్రాజెక్టు పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
జూన్‌లో పూర్తిచేసేలా..
రాజీవ్ లిఫ్ట్ పనుల పూర్తికి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఉంది. అయితే జూన్ వరకు పూర్తిచేసి వానాకాలం సీజన్‌కు సాగునీరు అందించాలనే లక్ష్యంతో అధికారులు పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణానికి అవసరమైన భారీ ఇనుప పైపులను అధికారులు చేరవేయగా, ఇతర పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో భూగర్భజలాలు కూడా పెరగనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫ శాంతినగర్‌లో పాలేరు వాగుపై రాజీవ్ లిఫ్ట్ పనులు ప్రారంభం
ఫ కొత్తగూడెం మేజర్ చివరి ఆయకట్టును సస్యశ్యామలం చేయడానికే ప్రాజెక్టు
ఫ రూ.54.03 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
ఫ పనులు పూర్తయితే అనంతగిరి, కోదాడ మండలాల రైతులకు లబ్ధి
సాగునీటి కొరత తీర్చేలా..
సాగునీటి కొరత తీర్చేలా..
సాగునీటి కొరత తీర్చేలా..
సాగునీటి కొరత తీర్చేలా..
సాగునీటి కొరత తీర్చేలా..


