బాలల వికాసానికి కృషిచేయాలి | - | Sakshi
Sakshi News home page

బాలల వికాసానికి కృషిచేయాలి

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

బాలల వికాసానికి కృషిచేయాలి

బాలల వికాసానికి కృషిచేయాలి

సూర్యాపేట టౌన్‌ : వెట్టిచాకిరీ చేస్తూ నిరాదరణకు గురైన, అలాగే తప్పిపోయి వచ్చిన బాలబాలికలను గుర్తించి వారి వికాసానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎస్పీ నరసింహ అన్నారు. ఆపరేషన్‌ స్మైల్‌ పూర్తయిన సందర్భంగా సోమవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించి కార్యక్రమానికి విజయంతంగా పూర్తిచేసిన సిబ్బందిని అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా నిరాదరణకు, వెట్టిచాకిరీ గురవుతున్న 176 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రులకు, సంరక్షులకు క్షేమంగా అప్పగించామన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 56 మంది బాలలు ఉండగా 49 మంది బాలురు, ఏడుగురు బాలికలు ఉన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 120 మంది బాలలు ఉండగా వీరిలో 80 మంది బాలురు, 40 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, పోలీస్‌ ఐటీ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్‌, చైల్డ్‌ సంరక్షణ అధికారులు రవి, నాగుల మీరా, సిబ్బంది పాల్గొన్నారు.

ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి

ఫిర్యాదుదారుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. సోమవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్‌ గ్రీవెన్స్‌ డే కార్యక్రమంలో పలువురు ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ఫోన్‌ ద్వారా పోలీస్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపొదన్నారు. ప్రతి కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్‌ చేయాలన్నారుఉ. గ్రీవెన్స్‌ డే ద్వారా వచ్చిన ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు.

ఫ ఎస్పీ నరసింహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement