కర్ల రాజేష్ మృతికి కారకులను శిక్షించాలి
ఆత్మకూర్ (ఎస్), నూతనకల్ : దళిత యువకుడు కర్ల రాజేష్ మృతికి కారకులైన పోలీస్ అధికారులను శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఆత్మకూర్ (ఎస్) మండల నెమికల్, నూతనకల్ మండల కేంద్రంలో సోమవారం సంతాప సభలు నిర్వహించారు. నూతకల్‌లో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో మంద కృష్ణమాదిగ మాట్లాడారు. రాజేష్ మృతి చెంది రెండు నెలలు కావస్తున్నప్పటికీ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోరు విప్పకపోవడం విచారకరమన్నారు. దళితులపై జరిగే అన్యాయాలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 5న సూర్యాపేటలో జరిగే రాజేష్ సంతాప సభకు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సభల్లో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్వాయి పరశురాములు, ఆత్మకూర్ (ఎస్) మండల అధ్యక్షులు మేడి కృష్ణ మాదిగ, నాయకులు చిన్న శ్రీరాములు మాదిగ, ఎడవల్లి ముత్తయ్య, ఎర్ర వీరస్వామి, బత్తుల ప్రసాద్, యాతాకుల వెంకన్న, యాతకుల రాజయ్య, బోల్లపాక సైదులు, శేఖర్, చిన్ని, జగన్, గరిగంటి ప్రకాష్, పాల్వాయి బాలయ్య, గంగాధరి లక్ష్మికాంత్, కాసర్ల మధు, నకిరేకంటి వెంకన్న, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఫ మంద కృష్ణమాదిగ


