ఎన్నికల్లో అడ్డు రాకుండా.. | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో అడ్డు రాకుండా..

Nov 25 2026 9:42 AM | Updated on Nov 25 2026 9:42 AM

● బైండోవర్‌ ఉల్లంఘన నెపంతో 9 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు రిమాండ్‌

● ఉల్లంఘన జరిమానా చెల్లిస్తామని చెప్పినా వినకుండా నరసన్నపేట సబ్‌జైలుకు తరలింపు

టెక్కలి: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పథకం ప్రకారం కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా టెక్కలి మండలం తొలుసూరుపల్లి గ్రామానికి చెందిన 9 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బైండోవర్‌ ఉల్లంఘన చేశారనే నెపంతో మంగళవారం హడావుడిగా రిమాండ్‌కు తరలించేశారు. గడిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బైండోవర్‌ ఉల్లంఘన చేశారంటూ గ్రామానికి చెందిన వమరవల్లి ధర్మరాజు, గూన షణ్ముఖరావు, ధవళ హరి, బమ్మిడి వనజనాభం, చింతాడ శ్రీకాంత్‌, బమ్మిడి నరసింహమూర్తి, బమ్మిడి దుర్గారావు, ఎస్‌. ధనుంజయరావును ఇటీవల స్టేషన్‌కు హాజరుకావాలని నోటీసులిచ్చారు. దీంతో వారు రోజూ పోలీస్‌స్టేషన్‌కు హాజరవుతున్నారు. కానీ మంగళవారం కార్యకర్తలను టెక్కలి పోలీస్‌స్టేషన్‌ నుంచి నేరుగా తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. అక్కడ తహసీల్దార్‌ లేకపోవడంతో నరసన్నపేట వైపు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వాహనంలో తరలించారు. ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌తో పాటు కార్యకర్తలంతా తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ఫోన్‌లో తహసీల్దార్‌తో మాట్లాడారు. బైండోవర్‌ ఉల్లంఘనపై నిర్ణయించిన జరిమానా చెల్లిస్తామని, తమ కార్యకర్తలకు ఎటువంటి రిమాండ్‌ విధించవద్దంటూ తిలక్‌ కోరారు. దీనికి తహసీల్దార్‌ సైతం అంగీకరించారు. కానీ కొంత సమయం తర్వాత టెక్కలి పోలీసులు చల్లపేట జంక్షన్‌ సమీపంలో తహసీల్దార్‌ రాంబాబును కలిసి రిమాండ్‌ ఆదేశాలను తీసుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను నరసన్నపేట సబ్‌జైలుకు తరలించేశారు.

అధికార దుర్వినియోగమే..

రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగాన్ని అధికార పార్టీ నాయకులు వాడుకుంటున్నారని పేరాడ తిలక్‌ మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడి ప్లాన్‌ ప్రకారమే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులకు ఎలాంటి అడ్డు లేకుండా ఉండేందుకు తమ కార్యకర్తలను రిమాండ్‌కు పంపించారని తెలిపారు. తాము జరిమానా చెల్లిస్తామని చెప్పినప్పటికీ కావాలనే రిమాండ్‌ విధించారని దుయ్యబట్టారు. వీరికి బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆయనతో పాటు నాయకులు కె.జీవన్‌, వి.శ్రీధర్‌రెడ్డి, ఎన్‌.సాబతో, బి.కార్తీక్‌, సిహెచ్‌.జీవన్‌, బి.రామకృష్ణ, సిహెచ్‌.అప్పన్న, జి.కనకారావు, డి.మదీన్‌, జి.శ్యామలరావు, కృష్ణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement