రణస్థలం: మండలంలోని వీఎన్‌పురం పంచాయతీ సూరాపురం గ్రామానికి చెందిన 20 టీడీపీ కార్యకర్తల కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో మంగళవారం చేరారు. వీరికి ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో టీడీపీ కార్యకర్తలు రాయవరపు దుర్గారావు, రాయవరపు జనార్థన్‌రావు, గురువిల్లి సీతయ్య, రాయవరపు గణేష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్ మాట్లాడుతూ పార్టీలో కొత్తగా వచ్చినవారితో కలిసిమెలిసి పని చేయాలని, వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కూటమి పాలనలో జరుగుతున్న కుట్రలు, సంక్షేమ పథకాలు ఎలా విస్మరించారో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఇటీవల ఎంపీటీసీ ఫలితాల్లో మండలంలో చక్కటి ఫలితాలు సాధించామని, అలాగే రానున్న సర్పంచ్ ఎన్నికల్లో అందరూ సమష్టిగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బాసి దుర్గారెడ్డి, మింది జనార్థన రెడ్డి, రెడ్డి చిన్నప్పలనాయుడు, బాసి రమణ, లంక సీతంనాయుడు, దుప్ప అక్కులు, రెడ్డి రమణ, మింది లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.


