పల్లెవించిన ప్రగతి | - | Sakshi
Sakshi News home page

పల్లెవించిన ప్రగతి

Nov 24 2026 1:18 AM | Updated on Nov 24 2026 1:18 AM

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

ఐదేళ్ల పాలనా కాలంలో వైఎస్‌ జగన్‌ సాధించిన మార్పులు సిక్కోలు జనం ఇంకా మర్చిపోలేదు. ఒకటో తారీఖు పింఛన్‌ అందుకున్న ప్రతిసారీ వైఎస్‌ జగన్‌ తెచ్చిన మార్పు గుర్తొస్తుంది. తల్లికి వందనం డబ్బులు పడితే.. ఆ పథకం ఎవరు ప్రారంభించారో గుండె చెబుతుంది. రైతు భరోసా కాస్త ఆలస్యమైనా జగన్‌ పాలనలో ఇలా ఉండేది కాదు కదా అని మనసు అంటుంది. చేయూత, తోడు వంటి పథకాలు అందక ఇబ్బంది పడుతున్న పేదలకు వైఎస్‌ జగన్‌ ఉంటే బాగుండేది అన్న ఆలోచన వస్తూనే ఉంటుంది. సర్కారు బడిలో బెంచీలు జగనన్న ఘనతను గుర్తు చేస్తూనే ఉంటాయి. వైఎస్‌ జగన్‌ పల్లెల్లో తెచ్చిన మార్పులు జనం గుండెల్లో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్నాయి. కానీ వాటిని ధ్వంసం చేసే ప్రక్రియకు చంద్రబాబు సర్కారు శ్రీకారం చుడుతోంది. జనం ఇబ్బంది పడుతున్నా ఆ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికే పూనుకుంటోంది.

నిర్దేశిత వ్యవధిలోనే..

జిల్లాలో 845 గ్రామ సచివాలయాల్లో లక్షలాది మందికి ఇంటి వద్దే సేవలు, సంక్షేమ పథకాలు అందేవి. బియ్యం కార్డు, పింఛన్లను 10 రోజుల్లోనూ, ఆరోగ్య శ్రీ కార్డును 20రోజుల్లో, ఇళ్ల స్థలాల పట్టాలను 90 రోజుల్లో ఇవ్వాలని జగన్‌ ప్రభుత్వం నిర్దేశించింది. అసలు అంతవరకు ఇలాంటి విధానం అన్నదే లేదు. ఏ పథకం కావాలన్నా అధికారులు, నాయకుల చుట్టూ తిరగాల్సిందే. అలాంటి అవస్థలను తప్పిస్తూ సచివాలయ వ్యవస్థ పేదల ఆత్మగౌరవాన్ని కాపాడింది. సచివాలయాలు వచ్చాక జిల్లాలో రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్య శ్రీ కార్డులు ఇళ్ల వద్దనే ఉండి లబ్ధిదారులు పొందారు.

పంచాయతీల్లో జరిగిన అభివృద్ధి పనులు

● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పంచాయతీల్లో 2019–20లో రూ. 153.72కోట్లతో, 2020–21లో రూ. 58.56కోట్లతో మౌలిక సౌకర్యాలు కల్పించారు.

● జిల్లాలో రూ. 301.52కోట్లతో 3లక్షల 73వేల 537ఇళ్లకు ఇంటింటి కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీరందించే కార్యక్రమాన్ని చేపట్టారు.

● నాడు– నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు రూపురేఖలు మారిపోయాయి. 1249 పాఠశాలల్లో రూ. 239.75కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.

● జిల్లాలో 1128 లేఅవుట్లు వేసి లక్షా 23వేల 062మందికి ఇళ్ల స్థలాలను అందించారు.

● ఐటీడీఎ పరిధిలో రూ. 60కోట్లతో తారురోడ్డు నిర్మాణాలు.. 150 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించారు.

● తొలి విడతగా 621గ్రామాల్లో సమగ్ర భూసర్వే చేపట్టి భూ వివాదాలు పరిష్కరించారు.

● రూ. 800కోట్లతో ఉద్దానంలోని తాగునీటి సౌకర్యం కల్పన కోసం ప్రాజెక్టు నిర్మించారు.

● రూ.100 కోట్లతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఆస్పత్రి కట్టారు.

● సచివాలయాలకు తోడుగా 834 రైతు భరోసా కేంద్రాలు, 685 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు నిర్మించారు.

యాభై ఇళ్లకు ఓ వలంటీర్‌.. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఇంటికే అందేది.

ఇంటికి అందుబాటులో సచివాలయం.. ఏ పౌర సేవ కావాలన్నా ఇట్టే వచ్చేది.

రేషన్‌ కార్డు కోసం ఏళ్ల తరబడి చూడాల్సిన అవసరం లేదు. అర్హత ఉంటే వచ్చి వాలేది.

పింఛన్ల కోసం ఏ నాయకుడి ఇంటి చుట్టూ తిరగాల్సిన అగత్యం లేదు. అర్హులై ఉంటే సచివాలయమే జాబితాలో

పేరు చేర్చేది. సంక్షేమ పథకాల నగదు ఠంచనుగా ఖాతాలో పడేవి. ఐదేళ్ల పాలనా కాలంలో వైఎస్‌ జగన్‌

సాధించిన ఘనత ఇది. దాదాపు రెండు దశాబ్దాలు అధికారంలో ఉన్న చంద్రబాబు ఈ వ్యవస్థలను నిర్వీర్యం

చేయడం తప్ప కొత్తగా ఒక్క వ్యవస్థనైనా నిర్మించలేకపోయారని సిక్కోలు జనం విమర్శిస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో పల్లెల్లో ప్రగతి బాటలు

ఇంటి వద్దకే వచ్చిన సేవలు

జిల్లాలో 855 సచివాలయాల్లో 539 రకాల సేవలు

అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న

చంద్రబాబు సర్కారు

నరసన్నపేట మండలం సత్యవరంలో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement