గ్రామాల్లో కొట్టుకుని చావాలా..? | - | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో కొట్టుకుని చావాలా..?

Nov 24 2026 1:18 AM | Updated on Nov 24 2026 1:18 AM

● కూటమిలో కుమ్ములాట

● ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రి,ఎమ్మెల్యేలను అడ్డుకొని నినాదాలు చేసిన నాయకులు

ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలి టీ పరిధి 5వ వార్డు గేదెలవానిపేట స్థానానికి కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల అభ్యర్థులకు తమ పార్టీల అధినేతలు బీ ఫారం లు ఇచ్చి బరిలో ఉంచారు. దీనికి తోడుగా ఆ వార్డులో టీడీపీలో ఉన్న సీనియర్‌ నాయకులకు కాకుండా వేరే వ్యక్తికి టిక్కె ట్‌ ఇచ్చారనే విమర్శ ఉంది. ఈ వార్డులో ప్రచారానికి సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ వచ్చారు. స్థానిక వయోడెక్ట్‌ సమీపంలో నరసన్నపేట వెళ్లే రహదారిపై తొలుత జనసేన నాయకులు సాదు రమేష్‌బా బు ఆధ్వర్యంలో జనసేన కౌన్సిలర్‌ అభ్యర్థి కింజరాపు గణేష్‌తోపాటు ఆ పార్టీకి చెందిన కార్యర్తలు కేంద్ర మంత్రి వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు. కూటమి అభ్యర్థులను పట్టించుకోవడం లేదని, సీనియర్‌ నాయకులకు చెప్పకుండా ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోవడం ఏంటని మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలు కొట్టుకుని చావాలా అని సూటిగా అడిగేశారు. జనసేన నాయకుడు జోక్యం చేసుకొని వారిని సద్దుమనిగించి వాహనాన్ని ముందుకు నడిచేలా చేశారు.

కుల ధ్రువీకరణ ఫిర్యాదుపై విచారణ

ఎల్‌.ఎన్‌ పేట: దబ్బపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న జమ్మి వెంకటరమణ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో పోటీకి దిగారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యా దుపై రెవెన్యూ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. దబ్బపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇరువర్గాలతో తహసీల్దార్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంటు గవరయ్య, ఆర్‌ఐ శ్రీనివాసరావు, వీఆర్వో జోగినాయుడు వేర్వేరుగా విచారణ చేపట్టారు. ఎప్పటి నుంచి బీసీ–డి (పోలినాటి వెలమ)గా కుల ధ్రువీకర ణ పత్రం పొందుతున్నారనే అంశాలను రెవె న్యూ అధికారులు జమ్మి వెంకటరమణను అడిగినట్లు తెలిసింది. అనంతరం వైఎస్సార్‌ సీపీ నాయకులు చేసిన అభ్యంతరాలతో కూడిన ఫిర్యాదును పరిశీలించి వివరాలను సేకరించా రు. ఇరు వర్గాల నుంచి రాత పూర్వకంగా స్టేట్‌ మెంట్‌లను రెవెన్యూ అఽధికారులు రికార్డు చేశా రు. ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు.

మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతం : ఎస్పీ

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయ్యేవరకు ఎలాంటి ఘట నలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్య లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. ప్రతీ ఒక్కరూ ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement