వారసులు.. ఘన చరితకు వారధులు | - | Sakshi
Sakshi News home page

వారసులు.. ఘన చరితకు వారధులు

Nov 24 2026 1:18 AM | Updated on Nov 24 2026 1:18 AM

ఆమదాలవలస రూరల్‌ : బొడ్డేపల్లి రాజగోపాలరావు.. సిక్కోలు పేరును ఢిల్లీ స్థాయిలో మార్మోగించిన రాజకీయ దురంధరుడు. జిల్లా రాజకీయ చరిత్రలో అగ్రభాగం ఆయనదే. ఆమదాలవలస నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో ఏ మారు మూలకు వెళ్లినా వారి పేరు ప్రస్తావించక తప్పదు. ఆ కుటుంబానికి చెందిన బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌, ఆయన భార్య బొడ్డేపల్లి అజంతాకుమారి మున్సి పల్‌ ఎన్నికల బరిలో ఉండడం, అందులోనూ అజంతాకుమారి చైర్‌ పర్సన్‌ స్థానానికి పోటీలో ఉండడంతో ఆమె గెలవాలని రాజగోపాలరావు అభిమానులు కోరుకుంటున్నారు.

ఘన చరిత్ర..

ఆమదాలవలస మండలం అక్కులుపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి కుటుంబానికి జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనూ మంచి రాజకీయ గుర్తింపు ఉంది. బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆరు మార్లు ఎంపీగా విజయం సాధించి ఢిల్లీలో చక్రం తిప్పా రు. రాజగోపాలరావు కోడలు బొడ్డేపల్లి సత్యవతి ఆమదాలవలస నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సేవలందించారు. ఆమె కుమారుడు బొడ్డేపల్లి రమేష్‌ ఒక సారి పురపాలక సంఘ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇతర కుటుంబ సభ్యులు సైతం ప్రజాసేవలోనే గడిపారు. ఇప్పుడు ఈ తరంలో వారి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌ కౌన్సిలర్‌గా, ఆయన భార్య బొడ్డేపల్లి అజంతా కుమారి చైర్‌పర్సన్‌గా వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీకి దిగారు. మరోవైపు కూటమి తరఫున స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తన భార్య కూన ప్రమీలను బరిలోకి దించారు. ఈ నేపథ్యంలో బొడ్డేపల్లి కుటుంబానికి పురపీఠం దక్కటం ఖాయమని ప్రజలు చెబుతున్నారు.

బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌

బొడ్డేపల్లి అజంతా కుమారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement