ఇంటింటికీ ఇసుక దందా ధనం | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికీ ఇసుక దందా ధనం

Nov 24 2026 1:18 AM | Updated on Nov 24 2026 1:18 AM

● ఆమదాలవలసలో ధన ప్రవాహం

● కోట్లు కుమ్మరిస్తున్న ఇసుకాసురులు

● మూసుకుపోయిన నిఘా నేత్రాలు

ఆమదాలవలస రూరల్‌: ఆమదాలవలసలో అధికార పార్టీకి వైఎస్సార్‌ సీపీ వణుకు పుట్టిస్తోంది. పుర పోరులో బరిలోకి దిగిన వైఎస్సార్‌ సీపీ అభ్య ర్థులను ఎదుర్కొనేందుకు ఇసుకాసురులు డబ్బు సంచీలు కుమ్మరిస్తున్నారు. ముఖ్యంగా బొడ్డేపల్లి కుటుంబ సభ్యులు బరిలో ఉండడంతో వైఎస్సార్‌ సీపీ గెలుపుపై ధీమాగా ఉంది.

ఇసుక సొమ్ము ఇంటింటికి పంపిణీ

వైఎస్సార్‌ సీపీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి స్థానికురాలు కావడం, టీడీపీ అభ్యర్థి కేవలం ఈ ఎన్నికల కోసం ఇక్కడ ఓటు నమోదు చేసుకోవడంతో పుర ఎన్నికలపై ఇక్కడి ఎమ్మెల్యే ప్రత్యేకంగా దృష్టి సారించారు. మున్సిపాలిటీ పరిధిలో 28 వార్డులు ఉండగా అక్రమ ఇసుక దందాలో వచ్చిన ధనాన్ని దాదాపు రూ.మూడుకోట్ల వరకు అందించినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. దీనికి తోడు తాగినోడికి తాగినంత మద్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక్కో వార్డుకి 20 నుంచి 30 కేసులు వరకు మద్యం సరఫరా చేసి నట్లు సమాచారం. డబ్బుతో మహిళలు ఓట్లు, మద్యంతో పురుషులు ఓట్లు కొనే ద్దామని ఆశ పడుతున్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం ఇంతలా పంపిణీ జరుగుతుంటే పోలీసు, ఎకై ్సజ్‌ అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు. ఈ నిఘా నేత్రాలను అధికార పార్టీ నాయకులు పూర్తిగా మూసివేశారనే వాదనలు కూడా లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement