ప్రజలకు ఇచ్చిన హామీలేమయ్యాయి..? | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఇచ్చిన హామీలేమయ్యాయి..?

Nov 24 2026 1:18 AM | Updated on Nov 24 2026 1:18 AM

● చంద్రబాబు సర్కారుకు ధర్మాన సూటి ప్రశ్న

● శ్రీకాకుళం మేయర్‌ అభ్యర్థికి జనరల్‌ ఏజెంట్‌గా ఉంటానని ప్రకటన

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ప్రజలకు ఇచ్చిన 160 హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? మూడేళ్ల పాలన లో అభివృద్ధి కంటే దోపిడీపైనే దృష్టి పెట్టారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మంచికి మారుపేరుగా ఉన్న గుండ లక్ష్మీదేవిని మేయర్‌గా, వైఎస్సార్‌సీపీ అభ్య ర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలని ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుండ లక్ష్మీదేవితో పాటు 29వ డివిజన్‌ (పెయ్యలవానిపేట) అభ్యర్థి ఉంగరాడ ఉష, 35వ డివిజన్‌ (సీపన్నాయుడుపేట) అభ్యర్థి సీపాన సత్యవతి, 33వ డివిజన్‌ (ఫాజుల్‌బేగ్‌పేట) అభ్యర్థి నారాయణశెట్టి జ్యోతి, 23వ డివిజన్‌ (తోటపాలెం) అభ్యర్థి కల్లేపల్లి రమణకుమారి, 34వ డివిజన్‌ (పీఎన్‌కాలనీ) అభ్యర్థి సీపాన సుధారాణి, 31వ డివిజన్‌ అభ్యర్థి బమ్మిడి శ్రీలక్ష్మికి మద్దతుగా ఆయా డివిజన్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. టీడీపీ ఇచ్చిన హామీలు చేసిన పనులు గమనిస్తే వారు చేసిన మోసం తెలుస్తుందన్నారు. పెన్షన్లను తీసేయడం, విద్యుత్‌ చార్జీలు పెంచడం, రిజిస్ట్రేషన్‌ ఫీజులు పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడమే చంద్రబాబుకి తెలిసిన విద్య అని అన్నారు. మేయర్‌ అభ్యర్థి మంచి వారు ఉంటే కార్పొరేషన్‌ నిధులతో సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. శ్రీకాకుళంలో 80 ఏళ్లుగా ఎంతో మంది పనిచేశారని, ఎవరూ ట్రాక్‌ తప్పలేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మాత్రం ఇసుక నుంచి మట్టి వరకు అన్నీ అమ్మేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. చివరకు తల్లి వయసులో ఉన్న మహిళను అగౌరవపరిచేంతలా దిగజారారని అన్నారు. లక్ష్మీదేవికి జనరల్‌ ఏజెంట్‌గా తానే ఉంటానని అన్నారు.

ఆమదాలవలస: చింతాడలో ప్రచారం చేస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి బొడ్డేపల్లి అజంతా కుమారి

పీఎన్‌ కాలనీ సభలో ప్రసంగిస్తున్న ధర్మాన ప్రసాదరావు, పక్కనే గుండ లక్ష్మీదేవి, సీపాన సుధారాణి, బమ్మిడి శ్రీలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement