అమ్మపై కూటమి కుట్రలు | - | Sakshi
Sakshi News home page

అమ్మపై కూటమి కుట్రలు

Nov 24 2026 1:18 AM | Updated on Nov 24 2026 1:18 AM

అరసవల్లి: ఆ నాయకులంతా నిన్నమొన్నటి వరకు ఆమె వెనుక తిరిగిన వారే. అమ్మా.. అంటూ సంబో ధిస్తూ ఆమె చేతి వంట ఆప్యాయంగా తిన్న వారే. కానీ ఇప్పుడు ఆ నాయకులే వెన్నుపోటు పొడుస్తున్నారు. జిల్లా కేంద్రంలో గుండ లక్ష్మీదేవిపై టీడీపీ నాయకులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. టీడీపీలో వరుస అవమానాలు, ఆపై భర్త మరణం, ఆయన విగ్రహ ఏర్పాటులో వివాదం వంటి వరుస సంఘటనల నేపథ్యంలో ఆ వేదన భరించలేక గుండ లక్ష్మీదేవి వైఎస్సార్‌ సీపీలో చేరారు. దీంతో ఆమె ను శ్రీకాకుళం మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించి వైఎస్సార్‌సీపీ గౌరవించింది. దీంతో టీడీపీ నాయకులు నోటికి పని చెబుతున్నారు. గుండ లక్ష్మీదేవి తన ప్రచారంలో ఎవరినీ పన్నెత్తి మాట అనడం లేదు. కేవలం తనకు జరిగిన అవమానాలను మాత్రమే ప్రస్తావిస్తున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఆమెను అనుచిత రీతిలో అగౌరవంగా సంబోధించి నగర వాసులకు ఆగ్రహం తెప్పించారు. ఇప్పుడు ఆ మరకను చెరపడానికి గత వారం రోజులుగా సోష ల్‌ మీడియా వేదికగా.. అలాగే సమావేశాల పేరిట ‘అమ్మ’ను అవమానించడమే పనిగా పెట్టుకున్నారు. ఆమె వయసును సైతం గౌరవించకుండా మాట్లాడి అహంకారాన్ని చాటుకుంటున్నారు. ఇవ న్నీ ఆ పార్టీ జిల్లా పెద్దలుగా వ్యవహరిస్తున్న వారు తెరవెనుక ఉండి నడిపిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇక రోజుకు 11 కిలోమీటర్ల మేర నడక ప్రచారం చేస్తున్న గుండ లక్ష్మీదేవికి, పట్టుమని పది నిమిషాలు కూడా ఏసీ గాలి తగలని ఓపెన్‌ టాప్‌లో ఉండలేని కూటమి అభ్యర్థి ప్రచారానికి తేడాను నగర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

నగరానికి నాయకుల వలస

మేయర్‌గా గుండ గెలుపు స్పష్టంగా కనిపిస్తుండడంతో కూటమి నేతలు పెద్ద నాయకులను దించుతున్నారు. మరోవైపు ఆమె మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఓ నాలుగు అద్దె నోర్లకు కూడా పనిచెప్పారు. కార్పొరేషన్‌ ఎన్నికలకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, నా దెండ్ల మనోహర్‌లతో సహా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విప్‌ బెందాళం అశోక్‌, ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, గౌతు శిరీషలు ప్రచారాలు చేస్తున్నారు. కానీ వీరందరినీ ధర్మాన సోదరుల సాయంతో గుండ లక్ష్మీదేవి తన కుమారుడితో పాటు ఒంటరిగానే ఎదుర్కొంటున్నారు. నేటితో ప్రచారాలు ముగియనుండడంతో ఇక పోలింగ్‌, ఆ తర్వాత కౌంటింగ్‌ కేంద్రాల్లో అధికార పార్టీల కుట్ర వ్యూహాలకు ఎలా ప్రతిఘటించాలనే కోణంలో ఇప్పటికే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యూహరచన చేస్తున్నారని సమాచారం.

‘ఓరయ్యా...మన లచ్చిమమ్మని ఏడిపిస్తన్నారట. నా మనవడు ఫోన్‌లో చూపించాడు. ఏం మాయరోగం వచ్చిందంట వాళ్లకి. ఏది పడితే అదే అనేస్తన్నారట. వాళ్లకి మరి ఓటెయ్యను.. మా ఇంటి వాసలో ఎవ్వరికీ వెయ్యనివ్వను.. జగను పార్టీకే ఓటేస్తా’..

జిల్లా కేంద్రంలోని వెలమ వీధికి చెందిన రుప్ప అన్నపూర్ణమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు సోమవారం సాయంత్రం ప్రచారంలో అన్న మాటలివి. అరసవల్లి 7వ డివిజన్‌ పరిధి వెలమవీధిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిమ్మ విజయలక్ష్మి (పల్లవి) తన భర్త గంగు సీతాపతితో కలిసి ప్రచారాన్ని చేస్తున్న సమయంలో ఈ సంభాషణ చోటుచేసుకుంది.

శ్రీకాకుళానికి పరిగెత్తుకుంటూ వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

పోలింగ్‌, కౌంటింగ్‌లో కుట్రలకు ప్రణాళికలు

గతం మరిచి గుండ లక్ష్మీదేవిని అవమానిస్తున్న టీడీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement