నిబంధనలు భేఖాతర్‌..! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు భేఖాతర్‌..!

Nov 19 2026 1:07 AM | Updated on Nov 19 2026 1:07 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: మండల కేంద్రంలోని నందిగాం ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా నూతనంగా ఎంపికై న మండల పరిషత్‌ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి వేదికల ఏర్పాటు చేశారు. పాఠశాల విద్యాశాఖ ఈనెల 13వ తేదీన జారీ చేసిన సర్క్యూలర్‌ ప్రకారం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇతర కార్యాలయాలు ఉండరాదని, పాఠశాలల ఆవరణలో పాఠశాల అవసరాలు తప్ప మిగతా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అయినా ఈ నిబంధనలు పట్టించుకోకుండా పాఠశాల ఆవరణలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సబబు కాదని పలువురు అంటున్నారు. దీనిపై ఎంపీడీవోను వివరణ కోరగా పాఠశాల రెండు భవనాలను మాత్రమే మండల పరిషత్‌ కార్యాలయ నిర్వహణకు ఉన్నతాధికారుల నుంచి గతంలో అనుమతి తీసుకొని ఉన్నామని, ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతుందన్నారు. పాఠశాల ఆవరణలో వేసిన వేదికలు, టెంట్లతో తమకు సంబంధం లేదన్నారు. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు, రాష్ట్ర డీజీపీకి, కలెక్టర్‌, ఎస్పీకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement