రణస్థలం: మండల కేంద్రంలోని రామతీర్థాలు రోడ్డులో కొండములగాం సమీపంలోని ఒక తోటలో పురుగుల మందు తాగి కొడమంచిలి సోంబాబు(39) అనే వ్యక్తి మృతి చెందినట్లు జేఆర్‌పురం పోలీసులు తెలిపారు. అతని భార్య మంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. సోంబాబు విశాఖపట్నం సారిగ్రామపురం యహగరి కాలనీలోని ఇంట్లో నుంచి చిన్న, చిన్న తగాదాలు వలన మూడు రోజులు క్రితం ఎటో వెళ్లిపోయారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రామతీర్థాలు రోడ్డులో ఒక తోటలో మృతి చెందినట్లు సమాచారం వచ్చిందన్నారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య మంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


