ఆమదాలవలస: ఈనెల 26న మున్సిపల్ ఎన్నికలు, 29న పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేరాలను అదుపు చేసేందుకు, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ముందస్తు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.మనోహర్ సూచించారు. ఆమదాలవలస ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో దస్త్రాలు, బైండోవర్ కేసులు తదితర అంశాలు పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. గతంలో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీ సమయంలో ఆమదాలవలస ఎకై ్సజ్ సీఐ జి.సతీష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్లు కుమార్, కావ్య, సిబ్బంది శ్రీను, పి.మురళీధర్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హాజరయ్యారు.


