శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళంలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న వేళ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో యువత భారీ సంఖ్యలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఆదివారం పెదపాడులోని క్యాంపు కార్యాలయంలో అరసవల్లి, గూనపాలెం, దమ్మలవీధికి చెందిన 200 కుటుంబాలు వైఎస్సార్ సీపీలోచేరారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల్లో వాలంటీర్లుగా పనిచేసిన వారు పార్టీ కండువాలు ధరించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ధర్మాన కోరారు. యువత రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించాలన్నారు. ప్రజలతో మమేకమై నాయకత్వానికి అండగా నిలవాలన్నారు. కొత్తగా పార్టీలోకి చేరిక యువతకు సముచిత స్థానం ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.


