పంచారామాలకు ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

Nov 16 2026 12:26 AM | Updated on Nov 16 2026 12:26 AM

శ్రీకాకుళం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ ఆధ్వర్యంలో పంచారామాలకు వేస్తున్న ప్రత్యేక బస్సులను భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్‌ఎస్‌ శర్మలు కోరారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ఆదివారం పంచారామాలకు బయలుదేరిన ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి పవిత్రమైన కార్తీక మాసంలో మహాశివుని దర్శనంలో భాగంగా పంచారామాలను ఒకే రోజు దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకమని పేర్కొన్నారు. అమరావతిలోని అమరేశ్వరస్వామి(అమరరామం), భీమవరంలోని సోమేశ్వరస్వామి(భీమారామం), పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరస్వామి (క్షీరారామం), ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వరస్వామి వారి ఆలయాలను సందర్శించుకొనే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 22, 29వ తేదీల్లోనూ కాంప్లెక్స్‌ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. సూపర్‌లగ్జరీ బస్సుకు రూ.2400, అల్ట్రాడీలక్స్‌ బస్సుకు రూ.2,350 ప్రయాణచార్జీగా నిర్ణయించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement