కంచిలి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన ఎన్నికల నియమావళి అమలు దృష్ట్యా ఎకై ్సజ్ శాఖ అధికారులు నాటుసారా రవాణా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపారు. సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో కంచిలి మండలంలోని జన్నిపుట్టుగ గ్రామ జంక్షన్ వద్ద కారు, ద్విచక్ర వాహనాల మీద రవాణా చేస్తున్న 2వేలు నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, ద్విచక్ర వాహనం నడుపుతున్న కొరికాన ధర్మరాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో 6 బస్తాలతో ఉన్న 1500 నాటుసారా ప్యాకెట్లను వదిలి పారిపోయిన మున్షీపేటకు చెందిన మొగిలి కుమార్, మొగిలి లక్ష్మినారాయణ మీద కేసులు నమోదు చేశారు. వీరు ఈ నాటుసారాను కవిటి, కంచిలి మండలాల్లో కొండిపుట్టుగ, జన్నిపుట్టుగ, పులకపుట్టుగ గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించి మరింత దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వారి నుంచి ఒక మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకొన్నారు. ఇలాగే ఇచ్ఛాపురం మొబైల్ టీమ్ ఇన్చార్జి సీఐ జీవీ రమణ నేతృత్వంలోని బృందం ఒడిశా నుంచి స్కూటీ మీద నాటుసారా తరలిస్తున్న గొల్లకంచిలికి చెందిన హరికృష్ణ నుంచి 450 నాటుసారా ప్యాకెట్లు, స్కూటీ స్వాధీనపర్చుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


