మూషికాలతోముప్పుతిప్పలుమూషికాలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. –8లో
పిల్లలు చదువుకోవాలి.. ఈ బతుకు నుంచి బయటపడాలి. ఈ దైన్యం నుంచి తప్పుకోవాలి. అదే ఆ తండ్రి ఆకాంక్ష. అందుకు ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధమయ్యాడు. ఎల్.ఎన్.పేట మండలం సూదిరాయిగూడ గ్రామానికి చెందిన సవర జోయల్ తన ఇద్దరు పిల్లలు మహేష్, డేవిడ్‌లను అంగన్‌వాడీ కేంద్రానికి పంపించేందుకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రానుపోను 16 కిలోమీటర్లు సైకిల్ సవారీ చేస్తున్నారు. కడగండి రిజర్వాయర్ సమీపంలో సూదిరాయిగూడ గిరిజన గ్రామం ఉంది. ఇక్కడ ఎనిమిది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అంగన్‌వాడీ కేంద్రం అందుబాటులో లేకపోవడంతో సమీపంలోని బొర్రంపేట అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లలను పంపిస్తుంటారు. రోజూ తన పనులను, బాధ్యతలు పక్కన పెట్టి మరీ పిల్లలను అంగన్‌వాడీకి తీసుకెళ్లి, మళ్లీ తీసుకువస్తున్నారు. చిన్న వయసులోనే పిల్లలకు చదువుపై ఆసక్తి పెరిగితే తర్వాత బాగా చదువుకుంటారని, అందుకే కష్టమైనా తీసుకెళ్తున్నానని తెలిపారు. అందుబాటులో అంగన్‌వాడీ ఉంటే మరింత బాగుంటుందని అన్నారు. – ఎల్‌ఎన్ పేట


