‘మహిళలపై బైండోవర్‌ కేసులు కడుతున్నారు’ | - | Sakshi
Sakshi News home page

‘మహిళలపై బైండోవర్‌ కేసులు కడుతున్నారు’

Nov 11 2026 3:57 AM | Updated on Nov 11 2026 3:57 AM

టెక్కలి: ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఉన్నామనే కారణంతో తమ గ్రామంలో పోలీసులు భయాందోళన కలిగి స్తూ ఆడవాళ్లపై అన్యాయంగా బైండోవర్‌ కేసులు కడుతున్నారని టెక్కలి మండలం తొలుసూరుపల్లి గ్రామం మహిళలు వాపోయారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలుసూరుపల్లి గ్రామంలో పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతూ రిగ్గింగ్‌ చేయడం పై గ్రామస్తులంతా పోలింగ్‌ రోజున టెక్కలి సబ్‌ కలెక్టర్‌ ఎదుట నిరసన చేశారు. అంతే కాకుండా రిగ్గింగ్‌ను ఆపాలనే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామంలో మహిళల్ని టార్గెట్‌ చేస్తూ బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారనే విషయం తెలుసు కుని నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌తో పాటు నాయకులు తొలుసూరుపల్లి గ్రామానికి చేరుకుని అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా తమ గ్రామంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఈ విధంగా రిగ్గింగ్‌లు జరగలేదని మహిళలు తెలిపారు. అన్యాయాన్ని ఆపాల ని చూసిన తమపై పోలీసులు బైండోవర్‌ కేసులు కట్టాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశా రు. ఇప్పటికే సుమారు 30 మందికి పైగా గ్రామస్తులపై బైండోవర్‌ కేసులు నమోదు చేసే ప్రయ త్నాలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం తిలక్‌ మాట్లాడుతూ.. బైండోవర్‌ కేసుల పేరుతో పోలీస్‌స్టేషన్‌కు రావాలని పిలిస్తే, ఏ ఒక్క మహిళ స్టేషన్‌కు వెళ్లొద్దన్నారు. అవసరమైతే గ్రామానికి వచ్చి వివరాలు తీసుకుని వెళ్లమని చెప్పాలని సూచించా రు. బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లే ప్ర యత్నం చేస్తే స్టేషన్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. సర్పంచ్‌ ఎన్నికల్లో తొ లుసూరుపల్లి పంచాయతీ సత్తాను చూపించాల న్నారు. ఆయనతో పాటు నాయకులు సత్తారు సత్యం, కర్ణిక జీవనరావు, బగాది రామకృష్ణ, చింతాడ అప్పన్న, వమరవల్లి ధర్మరాజు, బి.నరసింహమూర్తి, జి.కనకరాజు, జి.శ్రీను, వి. హరి, బి.జయరాం, చింతాడ శ్రీకాంత్‌, బి.రాజేష్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement